#DalaiLama : భార‌త్ సుర‌క్షితం ఇక్క‌డే జీవితం

ద‌లైలామా మ‌నసులో మాట

Dalai Lama : ప్ర‌ముఖ టిబెట్ ఆధ్యాత్మిక గురువుగా పేరొందిన దలైలామా (Dalai Lama)సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇవాళ ఆయ‌న ఆన్ లైన్ ద్వారా మీడియా స‌మావేశంలో మాట్లాడారు. భార‌త్ , చైనా గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

మీరు తైవాన్ కు వెళ‌తారా అన్న ప్ర‌శ్న‌కు తాను భార‌త్ లోనే ఉండేందుకు ఇష్ట‌ప‌డుతున్న‌ట్లు చెప్పారు ద‌లైలామా(Dalai Lama). తైవాన్, చైనా దేశాల మ‌ధ్య సంబంధాలు బాగా లేవ‌ని, ఇప్ప‌ట్లో తేలేవి కావ‌న్నారు.

అక్క‌డ అసాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొని ఉన్నందున తాను ఉండ‌లేన‌ని స్ప‌ష్టం చేశారు ద‌లైలామా. ఇదిలా ఉండ‌గా చైనా చీఫ్ జిన్ పింగ్ తో భేటీ అవుతారా అన్న ప్ర‌శ్న‌కు ఆయ‌న స‌మాధానం చెప్పారు.

ఆయ‌న‌తో స‌మావేశం అయ్యేందుకు ఇంకా ప్లాన్ చేసుకోలేద‌ని వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా చైనా నేత‌ల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు ద‌లైలామా. వాళ్లు విభిన్న సంస్కృతుల్లో ఉన్న వ్య‌త్యాసాన్ని గుర్తించడం లేద‌న్నారు.

ఆ దేశానికి చెందిన హ‌న్ తెగ ఆధిప‌త్యం ఎక్కువ‌గా ఉంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే చైనా దేశ‌స్తుల ప‌ట్ల త‌న‌కు ఎలాంటి దురుద్దేశం లేద‌న్నారు.

క‌మ్యూనిజం, మార్క్సిజం భావాల‌కు తాను మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు సంచ‌ల‌న కామెంట్స్ చేశారు ద‌లైలామా. మావో జిదాంగ్ నుంచి త‌న‌కు క‌మ్యూనిస్టు నేత‌లు తెలుస‌న్నారు.

వారి ఆశ‌యాలు మంచివ‌ని, కొన్ని స‌మ‌యాల్లో వాళ్లు విప‌రీతంగా ప్ర‌వ‌ర్తిస్తార‌ని ఆరోపించారు. పూర్తి ఆధిప‌త్యం చెలాయించేందుకు ప్ర‌య‌త్నిస్తార‌ని ఆరోపించారు. కొత్త త‌రం నేత‌ల పాల‌న‌లో చైనా మారుతుంద‌ని ఆశించాన‌ని, కానీ సేమ్ అలాగే ఉంద‌న్నారు.

Also Read : అన్న‌దాత‌ల‌కు టీటీడీ ఆలంబ‌న

Leave A Reply

Your Email Id will not be published!