#PPFScheme : త‌క్కువ పొదుపు అధిక రాబ‌డి

పోస్టాఫీస్ పీపీఎఫ్ స్కీం బెట‌ర్

PPF Scheme : డ‌బ్బులు దాచు కోవ‌డం అన్న‌ది ఇవాళ అత్యంత ముఖ్య‌మైన‌దిగా మారింది. రాను రాను బ‌త‌క‌డం గ‌గ‌నంగా మారింది. రేప‌టి భ‌విష్య‌త్తు బావుండాలంటే పొదుపు త‌ప్ప మ‌రో మార్గం లేదు.

కానీ ఎక్క‌డ పొదుపు చేయాలో తెలియ‌క చాలా మంది ఇబ్బందులు ప‌డుతుంటారు. కొంద‌రి వ‌ద్ద ఆశించిన మేర క్యాష్ ఉన్న‌ప్ప‌టికీ ఎక్క‌డైనా ఇన్వెస్ట్ చేస్తే ట్యాక్స్ క‌ట్టాల్సి వ‌స్తుందేమో. లేక పోతే ఆ డ‌బ్బులు రాకుండా పోతాయోమ‌న‌న్న ఆందోళ‌న‌లో ఉంటారు.

ఇందుకు పూర్తి భ‌ద్ర‌త ఉండేది ఏదైనా ఉందంటే అది ఒక‌టి కేంద్ర ప్ర‌భుత్వం ఆధీనంలోని పోస్టాఫీస్ కాగా మ‌రొక‌టి జీవిత భీమా సంస్థ -ఎల్ఐసీ.

అయితే రిస్క్ లేకుండా పొదుపు చేయాల‌ని అనుకుంటే పోస్టాఫీస్ బెట‌ర్. మ‌దుపు చేసిన డ‌బ్బుల‌కు గ్యారెంటీ తో పాటు అధిక వ‌డ్డీ కూడా వ‌స్తుంది.

దీర్గ‌కాలిక ఇన్వెస్ట్ మెంట్ వ్యూహంతో ఉంటే ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ – పీపీఎఫ్ బెట‌ర్(PPF Scheme). ఒక ఏడాది నుంచి 15 ఏళ్ల వ‌ర‌కు గ‌డువు ఉంటుంది. సేవింగ్స్ ప‌థ‌కాల‌పై వార్షిక ప్రాతిప‌దిక‌న 7.1 వ‌డ్డీ రేటు అమ‌ల‌వుతుంది.

ఈ స్కీమ్ 20 ఏళ్ల వ‌ర‌కు కొన‌సాగించేందుకు వీలుంది. నెల నెలా క‌ట్టొచ్చు లేదంటే ఏడాదికి ఒక‌సారి క‌ట్టే అవ‌కాశం క‌ల్పించింది. నెల‌కు ఒక‌సారి అయితే రూ. 12, 500 చెల్లించాల్సి ఉంటుంది.

దీనికి ఆదాయ ప‌న్ను నుంచి మిన‌హాయింపు ల‌భిస్తుంది. ఒక వేళ 15 ఏళ్ల‌ల్లో రూ. 22.5 ల‌క్ష‌లు పొదుపు చేస్తే రూ. 18 లక్ష‌ల దాకా వ‌డ్డీ ల‌భిస్తుంది. మెచ్యూరిటీ తీరాక మొత్తం అస‌లు, వ‌డ్డీ క‌లుపుకుని రూ. 40 ల‌క్ష‌ల 70 వేలు ల‌భిస్తాయి.

Also Read : స్టార్ట‌ప్ ల‌కు టీహ‌బ్ బంప‌ర్ ఆఫ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!