#YVSubbareddy : శ్రీ‌వారి భ‌క్తుల‌కు తీపిక‌బురు

ఎక్కువ సంఖ్య‌లో ద‌ర్శ‌నం

YV Subbareddy  : ఆ క‌లియుగ దైవం శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, అలివేలు మంగ‌మ్మ కొలువై ఉన్న తిరుమ‌ల‌ను సంద‌ర్శించే భ‌క్తుల‌కు తీపి క‌బురు చెప్పారు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy ).

త్వ‌ర‌లోనే స్వామి వారి ద‌ర్శ‌నం కోసం ఎక్కువ మంది భ‌క్తుల‌ను అనుమ‌తించ‌డం జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించారు. ఇవాళ ఆయ‌న తిరుమ‌ల‌లో మీడియాతో మాట్లాడారు.

క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్టింది. భ‌క్తులు కూడా సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో ఇబ్బందుల‌కు లోనై స్వామి వారి ద‌ర్శ‌నం కోసం వ‌స్తున్నారు.

వారి ఇక్క‌ట్ల‌ను దృష్టిలో పెట్టుకుని మ‌రికొంత మందికి ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించాల‌ని అనుకుంటున్న‌ట్లు చెప్పారు. భారీ వ‌ర్షాల కార‌ణంగా న‌డ‌క‌దారి భ‌క్తులు తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు.

ప‌రిస్థితులు మెల మెల్ల‌గా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. స్వామి వారి కృప మ‌నంద‌రిపై ఉండ‌డంతో భ‌క్తుల‌కు మెరుగైన సేవ‌లు అందించే భాగ్యం త‌మ‌కు క‌లుగుతోంద‌న్నారు.

త్వ‌ర‌లోనే అధికారుల‌తో చర్చించి త‌గు నిర్ణ‌యం తీసుకుంటామ‌ని తెలిపారు వైవీ సుబ్బారెడ్డి. భ‌క్తుల సంఖ్య‌ను పెంచే విష‌యంపై పూర్తి క్లారిటీ ఇవ్వ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు టీటీడీ చైర్మ‌న్.

ఇంకో విష‌యం గురించి పూర్తి స్ప‌ష్ట‌త ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. స‌ర్వ ద‌ర్శ‌నం టోకెన్లు ఆన్ లైన్ లో ఇవ్వాలా లేదా ఆఫ్ లైన్ లో ఇవ్వాలా అనేది త్వ‌ర‌లో నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy ).

ఎంత మంది భ‌క్తులు తిరుమ‌ల‌కు వ‌చ్చినా ఆశించిన మేర‌కంటే ఎక్కువ‌గా వ‌స‌తి సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు.

ప్ర‌పంచం న‌లుమూల‌ల నుంచి వ‌చ్చే వారికి ఎక్క‌డా ఇబ్బంది ప‌డ‌కూడ‌ద‌నే టీటీడీ స‌క‌ల సౌక‌ర్యాల‌ను క‌ల్పిస్తోంద‌న్నారు టీటీడీ చైర్మ‌న్.

Also Read : శ్రీ‌వారి భ‌క్తుల‌కు ఆర్టీసీ బంప‌ర్ ఆఫ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!