#SBIShock : ఖాతాదారుల‌కు ఎస్బీఐ బిగ్ షాక్

క్రెడిట్ కార్డుల‌పై బాదుడే బాదుడు

SBI Shock : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – ఎస్బీఐ ఊహించ‌ని షాక్ ఇచ్చింది. ఇప్ప‌టికే అందిస్తున్న స‌ర్వీసుల‌పై ముక్కుపిండి వ‌సూలు చేస్తున్న స‌ద‌రు బ్యాంక్ డెబిట్ కార్డుల పైనే కాకుండా క్రెడిట్ కార్డుల‌పై బాదుడు మొద‌లు పెట్టింది.

ఇక నుంచి క్రెడిట్ కార్డుల మీద ఈఎంఐ పై ఏదైనా వ‌స్తువు కొన్నా లేదా అవ‌స‌రం ఉండి డ‌బ్బులు తీసుకున్నా బాదుడే బాదుడు. ఇందుకు సంబంధించి అద‌న‌పు ఛార్జీలు భ‌రించాల్సిందే. ఈ విష‌యాన్ని ఎస్బీఐ (SBI Shock)అధికారికంగా ప్ర‌క‌టించింది.

రిటైల్ అవుట్ లెట్స్ , ఈ కామ‌ర్స్ వెబ్ సైట్ ల‌లో వ‌స్తువుల‌ను కొనుగోలు చేసే వారికి బిగ్ షాక్ త‌గ‌ల‌నుంది ఇక‌నుంచి. ఆయా వ‌స్తువుల కొనుగోలుకు సంబంధించి నెల‌స‌రి స‌మాన వాయిదా చెల్లింపు (ఈఎంఐ ) గా మార్చుకుంటే ఇక బాదుడే.

అటువంటి ఏ లావాదేవీపైన నైనా రూ. 99 ప్రాసెసింగ్ ఫీజుతో స‌హా ప‌న్నుల్ని కూడా వ‌సూలు చేయ‌నున్న‌ట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI Shock)పేమెంట్ స‌ర్వీసెస్ ప్ర‌క‌టించింది.

ఈ నిర్ణ‌యం డిసెంబ‌ర్ 1 నుంచి అమ‌లులోకి రానుంది. ఈఎంఐ కొనుగోళ్ల‌పై వ‌సూలు చేసే అస‌లుకు సంబంధించిన వ‌డ్డీతో పాటు ఈ అద‌న‌పు చార్జీలు (ఎక్సెస్ చార్జీలు) అద‌న‌మ‌ని సంస్థ స్ప‌ష్టం చేసింది.

ఈ సంద‌ర్భంగా ఎస్బీఐ ఖాతాదారుల‌కు (డెబిట్, క్రెడిట్ ) ఈ మెయిల్ ద్వారా స‌మాచారం పంపింది. కాగా యూజ‌ర్ల‌కు ఒక వెసులుబాటు క‌ల్పించింది ఎస్బీఐ.

అదేమిటంటే కొనుగోళ్ల‌కు సంబంధించి డిసెంబ‌ర్ 1కి ముందుగా జ‌రిగి ఉంటే, ఆ తేదీ త‌ర్వాత ఈఎంఐ బుకింగ్ జ‌రిగితే ప్రాసెసింగ్ ఫీజు నుంచి మిన‌హాయింపు ఉంటుంద‌ని తెలిపింది. ఇదొక్క‌టే తీపిక‌బురు. మిగ‌తాదంతా వాయింపే.

Also Read : స్టార్ట‌ప్ ల‌కు టీహ‌బ్ బంప‌ర్ ఆఫ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!