#China : అమెరికాను నెట్టేసిన డ్రాగ‌న్ 

సంప‌ద‌లో వ‌ర‌ల్డ్ లో నెంబ‌ర్ 1 

China : నిన్న‌టి దాకా తమదే అధికార‌మ‌ని విర్ర‌వీగుతూ వ‌చ్చిన అమెరికాకు కోలుకోలేని షాక్ త‌గిలింది. నువ్వా నేనా అంటూ ప్ర‌తి దానిలో పోటీ ప‌డుతున్న అమెరికాకు నిద్ర లేకుండా చేస్తున్న జిన్ పింగ్ సార‌థ్యంలోని చైనా పెద్ద‌న్న‌కు దిమ్మ తిరిగేలా షాకిచ్చింది.

ప్ర‌పంచంలో అత్యంత సంప‌న్న‌వంత‌మైన దేశంగా డ్రాగ‌న్ చైనా(China) నిలిచింది. ఇదే విష‌యాన్ని అధికారికంగా బ్లూమ్ బ‌ర్గ్ వెల్ల‌డించింది. గ‌డిచిన 20 ఏళ్ల‌లో ప్ర‌పంచ సంప‌ద మూడు రెట్లు పెరిగింద‌ని తెలిపింది.

ఇందులో భాగంగా అమెరికాను దాటుకుని డ్రాగ‌న్ తొలి స్థానానికి చేరింద‌ని వెల్ల‌డించింది. మెకిన్సే అండ్ కో రీసెర్చ్ వింగ్ చేసిన ప‌రిశోధ‌న‌లో ఈ వాస్త‌వం తేలిన‌ట్లు ప్ర‌క‌టించింది.

ఇదే స‌మ‌యంలో 10 దేశాల బ్యాలెన్స్ షీట్ల‌ను ప‌రిశీలించి ఈ పూర్తి నివేదిక ఇచ్చిన‌ట్లు బ్లూబ్ బ‌ర్గ్ వెల్ల‌డించింది. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా ఆదాయంలో 60 శాతం ఆదాయం ఆ ప‌ది దేశాల‌కు వెళ్లింద‌ని పేర్కొంది.

గ‌త ఏడాది 2020 లో 514 ట్రిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరింద‌ని, అయితే 2000లో 156 ట్రిలియ‌న్ డాల‌ర్లుగా ఉండేద‌ని తెలిపింది. భారీగా పెరిగిన ఆదాయంలో అత్య‌ధిక వాటా చైనా సొంతం చేసుకుంద‌ని ప్ర‌క‌టించింది.

మొత్తం 514 ట్రిలియ‌న్ డాల‌ర్ల‌లో డ్రాగ‌న్(China) ఏకంగా మూడో వంతు ఆక్ర‌మించిద‌ని, అమెరికా త‌న ప‌ట్టు కోల్పోయింద‌ని పేర్కొంది.

విచిత్రం ఏమిటంటే ప్ర‌పంచ వాణిజ్య సంస్థ‌లో చేర‌డానికి ముందు చైనా సంప‌ద కేవ‌లం 7 ట్రిలియ‌న్ డాలర్లు ఉండ‌గా ప్ర‌స్తుతం అది 120 ట్రిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరింద‌ని బ్లూమ్ బ‌ర్గ్ స్ప‌ష్టం చేసింది.

అయితే పెద్ద‌న్న అమెరికా ఆదాయం కేవ‌లం 90 ట్రిలియ‌న్ డాల‌ర్లు కావ‌డం గ‌మ‌నార్హం.

Also Read : ట్విటర్ సిఇఓపై ‘ప్రిన్స్ హ్యారీ’ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!