#CMKCR : ‘ప‌ల్లె’కు పుర‌స్కారం కేసీఆర్ సంతోషం

భూదాన్ పోచంప‌ల్లికి సీఎం అభినంద‌న

CM KCR  : తెలంగాణ సిగ‌లో మ‌రో పుర‌స్కారం రావ‌డం ప‌ట్ల సంతోషాన్ని వ్య‌క్తం చేశారు రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్(CM KCR). ఈ సంద‌ర్భంగా ఆయ‌న యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా భూదాన్ పోచంప‌ల్లి గ్రామాన్ని కొనియాడారు.

ఆ గ్రామం అంత‌ర్జాతీయ గుర్తింపును పొంద‌డం ఆనందంగా ఉంద‌న్నారు. ఈ పుర‌స్కారం ఆ ప‌ల్లె ప్ర‌జ‌ల‌కే కాదు తెలంగాణ‌లోని నాలుగున్న‌ర కోట్ల ప్ర‌జ‌ల‌కు ద‌క్కిన గౌర‌వంగా భావిస్తున్నాన‌ని ప్ర‌శంసించారు.

ఉత్త‌మ ప్ర‌పంచ ప‌ర్యాట‌క గ్రామంగా ఎంపికైంది. ఐక్య రాజ్య స‌మితి అనుబంధ సంస్థ ప్ర‌పంచ ప‌ర్యాట‌క సంస్థ భూదాన్ పోచంప‌ల్లి గ్రామాన్ని ఉత్త‌మ ప్ర‌పంచ ప‌ర్యాట‌క ప‌ల్లెగా ఎంపిక చేసింది.

భార‌త దేశంలో 95 వేల గ్రామాలు ఉండ‌గా 3 గ్రామాలు పోటీ ప‌డ్డాయి. ఆ మూడు ప‌ల్లెల్లో భూదాన్ పోచంప‌ల్లి గ్రామాన్ని ఎంపిక చేశారు. ఇప్ప‌టికే భూదాన ఉద్య‌మంలో ఈ పల్లె చ‌రిత్ర సృష్టించింది.

ఆనాడు వినోభా భావే ప్రారంభించిన భూదాన ఉద్య‌మానికి వెన్ను ద‌న్నుగా నిలిచింది. అంతే కాదు ఇక్క‌త్ చీర‌ల‌కు భూదాన్ పోచంప‌ల్లి ఎంతో ప్ర‌సిద్ది చెందింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో పేరుంది.

త‌లెంగాణ సాంస్కృతిక పున‌రుజ్జీవ‌నం దిశ‌గా స్వ‌యం పాల‌న‌లో ప్ర‌భుత్వం చేప‌ట్టిన కార్యాచ‌ర‌ణ ఫ‌లితంగా చారిత్ర‌క ప‌ర్యాట‌క ప్రాంతాలు అంత‌ర్జాతీయంగా గుర్తింపు సాధిస్తున్నాయ‌ని కొనియాడారు కేసీఆర్(CM KCR).

ఇటీవ‌లే రామ‌ప్ప ఆల‌యానికి యునెస్కో ప్ర‌పంచ వార‌స‌త్వ హోదాను క‌ల్పించింది. ఇదిలా ఉండ‌గా డిసెంబ‌ర్ 2న స్పెయిన్ లోని మాడ్రిడ్ లో జ‌రిగే కార్య‌క్ర‌మంలో ఈ ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు బ‌హూక‌రిస్తార‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

Also Read : భార‌త్ సుర‌క్షితం ఇక్క‌డే జీవితం

Leave A Reply

Your Email Id will not be published!