#KTR : ‘ఇమేజ్’ లో తెలంగాణ ఫేమ‌స్

ఇక హాలీవుడ్ కు సైతం సేవ‌లు

KTR : అన్ని రంగాల‌లో తెలంగాణ త‌న‌దైన ముద్ర‌తో దూసుకు వెళుతోంది. ఇన్నోవేష‌న్ ఇన్ యానిమేష‌న్ , మ‌ల్టీ మీడియా, గేమింగ్ , అండ్ ఎంట‌ర్ టైన్ మెంట్ – ఇమేజ్ కు సంబంధించిన అన్ని రంగాల్లో తెలంగాణ టాప్ లో ఉంద‌న్నారు మినిష్ట‌ర్ కేటీఆర్.

రాబోయే కాలంలో ఈ రంగాల్లో ఎన‌లేని అవ‌కాశాలు ద‌క్క‌నున్నాయ‌ని వెల్ల‌డించారు. హెచ్ఐసీసీ వేదిక‌గా ఈనెల 19 వ‌ర‌కు ఇండియా జాయ్ పేరుతో నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ (KTR )మాట్లాడారు.

క‌రోనా సంక్షోభం ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయేలా చేసినా డిజిట‌లైజేష‌న్, ఐటీ అనుబంధ సంస్థ‌ల్లో భారీగా కొలువులు ల‌భించాయ‌న్నారు. ప్ర‌త్యేకించి వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం కు ప్ర‌యారిటీ పెరిగింద‌న్నారు కేటీఆర్.

2025 నాటికి మ‌న దేశంలో ఇంటర్నెట్ వినియోగ‌దారుల సంఖ్య 90 కోట్ల‌కు చేరుతుంద‌ని ఓ అధ్య‌య‌నం స్ప‌ష్టం చేసింద‌న్నారు. వ‌చ్చే 2024 నాటికి ఇమేజ్ సెక్టార్ మార్కెట్ వాల్యూ 13.5 శాతం వార్షిక వృద్ధి రేటుతో రూ. 3 ల‌క్ష‌ల కోట్ల‌కు పెరుగుతుంద‌ని వెల్ల‌డించారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా కొన్ని రంగాల‌లోనే అత్య‌ధిక అవకాశాలు ల‌భిస్తున్నాయ‌ని పేర్కొన్నారు కేటీఆర్(KTR ). ఇదిలా ఉండ‌గా ఆసియా లోనే అతి పెద్ద డిజిట‌ల్ ఎంట‌ర్ టైన్ మెంట్ ఫెస్టివల్ ఇండియా జామ్ ను నిర్వ‌హిస్తోంది తెలంగాణ.

ఇందులో భాగంగా గేమ్, దేశీ టూన్స్ , వీఎఫ్ఎక్స్ , క‌నెక్ట్, ఓటీటీ ప‌ల్స్ పై స‌ద‌స్సులు నిర్వ‌హిస్తున్నారు. 30 వేల మంది ఇండ‌స్ట్రీ ప్రొఫెష‌న‌ల్స్ , 300 మంది ఇంట‌ర్నేష‌న‌ల్ డెలిగేట్స్ , 100 మంది ఇన్వెస్ట‌ర్లు, ప‌బ్లిష‌ర్లు పాల్గొన్నారు.

గేమింగ్ రంగంలోనూ తెలంగాణ గ‌ణ‌నీయ వృద్ధి సాధించింద‌న్నారు. గ్రీన్ గోల్డ్ రూపొందించిన చోటా భీం అనేక రికార్డులు కొల్ల‌గొట్టింద‌న్నారు. చిత్ర ప‌రిశ్ర‌మ‌తో పాటు హాలీవుడ్ కు వీఎఫ్ ఎక్స్ ఔట్ సోర్సింగ్ సేవ‌లు అందిస్తున్నామ‌న్నారు.

Also Read : త‌క్కువ పొదుపు అధిక రాబ‌డి

Leave A Reply

Your Email Id will not be published!