#PaytmCeo : పేటీఎం ఫౌండ‌ర్ కంట త‌డి

జాతీయ గీతం స్ఫూర్తి దాయ‌కం

Paytm Ceo : భార‌తీయ డిజిట‌ల్ పేమెంట్స్ సంస్థ‌లో టాప్ లో ఉన్న పేటీఎం వ్య‌వ‌స్థాప‌కుడు విజ‌య్ శేఖ‌ర్ శ‌ర్మ కంట‌త‌డి పెట్టాడు. జాతీయ గీతం ఆలాపిస్తున్న స‌మ‌యంలో భార‌త భాగ్య విధాత అన్న దాని వ‌ర‌కు వ‌చ్చే స‌రిక‌ల్లా క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యాడు.

దేశాన్ని ప్ర‌భావితం చేసే అత్యున్న‌త వ్యాపార వేత్త‌ల‌లో శ‌ర్మ కూడా ఒక‌రుగా ఉన్నారు. ఆయ‌న స్థాపించిన పేటీఎం(Paytm Ceo) ఇవాళ దుమ్ము రేపుతోంది. జీరో నుంచి హీరోగా ఎదిగిన ఎంట్ర‌ప్యూన‌ర్ల జాబితాలో విజ‌య శేఖ‌ర్ శ‌ర్మ కూడా చోటు సంపాదించుకున్నాడు.

ఎన్నో క‌ష్టాలు, మరెన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకోవ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. భార‌త్ లో అతి పెద్ద ఐపీఓగా పేటీఎం ప్ర‌జ‌ల ముందుకు వ‌చ్చింది. దాదాపు రూ. 18 వేల 300 కోట్ల‌ను స‌మీక‌రించ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌బ్లిక్ ఇష్యూకి వ‌చ్చింది.

బాంబే స్టాక్ ఎక్ఛేంజీలో పేటీఎం లిస్టింగ్ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యాడు. నేష‌న‌ల్ ఆంథమ్ ఆలాపిస్తుండ‌గా త‌ట్టుకోలేక క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్ అవుతోంది.

జాతీయ గీతం విన్న‌ప్పుడ‌ల్లా నేను ఎమోష‌న‌ల్ అవుతాను. కా కంట్లో క‌న్నీళ్లు ఆగ‌వంటూ విల‌పించాడు. భార‌త భాగ్య విధాత అంటూ త‌న ప్ర‌సంగాన్ని ప్రారంభించాడు.

యూపీలోని అలీఘ‌డ్ కు చెందిన శ‌ర్మ ఓ సాధార‌ణ కుటుంబం నుంచి వ‌చ్చాడు. 2010లో పేటీఎం స్థాపించాడు. 2017 క‌ల్లా బిలియ‌న‌ర్ల జాబితాలో చోటు ద‌క్కించుకున్నాడు. కాగా లిస్టింగ్ అయిన కొద్ది గంట‌ల్లోనే చాలా న‌ష్టం వ‌చ్చింది పేటీఎంకు.

Also Read : త‌క్కువ పొదుపు అధిక రాబ‌డి

Leave A Reply

Your Email Id will not be published!