#GuruDwaraShedrilSingh : ‘గురు ద్వారా’ ప్రార్థ‌న‌ల‌కు సిద్ధం

ప్ర‌క‌టించిన గురు ద్వారా క‌మిటీ

Guru Dwara Shedril Singh : ముస్లిం సోద‌రుల‌కు తీపి క‌బురు చెప్పింది గురు ద్వారా ప్ర‌బంధ్(Guru Dwara Shedril Singh) క‌మిటీ. గురు ద్వారాలో శుక్ర‌వారం రోజు న‌మాజ్ చేసుకోవ‌చ్చ‌ని ప్ర‌క‌టించింది.

హ‌ర్యానా లోని గురు గ్రామ్ లో బ‌హిరంగ ప్ర‌దేశాల‌లో ముస్లింల ప్రార్థ‌న‌ల‌పై ప‌లువురు అభ్యంత‌రం తెలియ చేస్తుండ‌డంతో స్థానికులు అభ్యంత‌రం తెలిపారు. మ‌రికొంద‌రు ప్రార్థ‌న‌లు చేయ‌కుండా అడ్డుకున్నారు.

ఈ త‌రుణంలో గురుగ్రామ్ స‌ద‌ర బ‌జార్ లోని గురు ద్వారా అసోసియేష‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. శుక్ర‌వారం జ‌రిపే ప్రార్థ‌న‌ల కోసం ముస్లిం సోద‌రులు నిర‌భ్యంత‌రంగా గురు (Guru Dwara Shedril Singh )ద్వారా ప్రాంగ‌ణాన్ని వినియోగించు కోవ‌చ్చ‌ని స్ప‌ష్టం చేసింది.

ఇది గురు ఘ‌ర్ . ఎటువంటి వివ‌క్ష లేని ప్రాంతం. ఇందులో కుల‌, మ‌తాల‌కు ఆస్కారం ఉండ‌దు. అంద‌రూ స‌మానులేన‌ని భావించే ప‌విత్ర‌మైన స్థ‌లం.

ఇది ఒక్క‌రి కోసం కాదు అంద‌రి కోసం ఉంద‌ని తెలిపింది క‌మిటీ. హిందూ, ముస్లింలు అన్న భేద భావం ఎక్క‌డా గురుగ్రామ్ లో ఉండ‌ద‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేసింది.

ఎవ‌రైనా త‌మ సంప్ర‌దాయం ప్రకారం ఈ ప‌విత్ర‌మైన స్థ‌లంలోకి రావ‌చ్చు. ప‌విత్రమైన హృద‌యంతో, మ‌న‌స్సుతో త‌మ దైవాల‌ను స్మ‌రించు కోవ‌చ్చు. ఎలాంటి అడ్డంకులు, అభ్యంత‌రాలు అంటూ ఉండ‌వ‌ని పేర్కొంది.

అన్ని వ‌ర్గాల వారికి ఆహ్వానం ఉంటుంది ఎల్ల‌ప్పుడూ. ఇందులో రాజీకాయాలంటూ తీసుకు రావ‌డాన్ని క‌మిటీ ఒప్పుకోదు. ముస్లిం సోద‌రుల కోసం గురు ద్వారా బేస్ మెంట్ ను తెరుస్తామ‌ని వెల్ల‌డించింది.

ఈ మేర‌కు అధికారికంగా ప్ర‌క‌టించారు గురు ద్వారా ప్రెసిడెంట్ షెర్దిల్ సింగ్ సిద్దూ(Guru Dwara Shedril Singh).

Also Read : శ్రీ‌వారి భ‌క్తుల‌కు ఆర్టీసీ బంప‌ర్ ఆఫ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!