#FarmBill2020 : ర‌ద్దు చేసిన ఆ చ‌ట్టాల్లో ఏముంది

మోదీ క్ష‌మాప‌ణ కోర‌డం విచిత్రం

Farm Bill 2020  : ప్ర‌ధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సంకీర్ణ ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకు వ‌చ్చిన సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

రైతుల‌కు మేలు చేయాలనే ఈ చ‌ట్టాల‌ను తీసుకు వ‌చ్చాం. ఏ ఒక్క రైతుకు అన్యాయం చేయకూడ‌ద‌నేదే మా అభిమ‌తం. కానీ త‌మ చ‌ట్టాలను రైతుల‌కు స‌రిగా అర్థం చేయించ లేక పోయామ‌ని పేర్కొన్నారు న‌రేంద్ర మోదీ.

మేం అనేక ద‌ఫాలుగా చ‌ర్చ‌లు జ‌రిపాం. కానీ స‌క్సెస్ కాలేక పోయామ‌ని వాపోయారు.

త‌న‌ను క్ష‌మించ‌మంటూ కోరారు ప్ర‌ధాని. వ‌చ్చే పార్ల‌మెంట్ సెష‌న్ లో అధికారికంగా ర‌ద్దు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు కూడా.

ఇవాళ గురు నాన‌క్ దినోత్స‌వం. ఈ శుభ వేళ మీరంతా ఆందోళ‌న‌ల‌ను విర‌మించి ఇంటికి వెళ్లాల‌ని కోరారు మోదీ.

అంతే కాకుండా క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర – ఎంఎస్పీ నిర్మాణాన్ని ప‌ట్టిష్టం చేసేందుకు వ్య‌వ‌సాయ క‌మిటీని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఇక మొత్తం సాగు చ‌ట్టాల‌పై మ‌రోసారి చ‌ర్చ జ‌రుగుతోంది. ఇంత‌కూ ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించిన ఆ మూడు చ‌ట్టాల్లో ఏముందనేది ముఖ్యం.

రైతుల ఉత్ప‌త్తి వాణిజ్యం చ‌ట్టం 2020(Farm Bill 2020 )రైతుల‌ను రాష్ట్ర వ్య‌వ‌సాయోత్ప‌త్తి మార్కెట్ క‌మిటీల ప‌రిమితుల నుంచి విముక్తి చేయ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకుంది.

దీని ద్వారా రైతులు (Farm Bill 2020 )త‌మ ఉత్ప‌త్తుల‌ను ఎక్క‌డైనా విక్ర‌యించు కోవ‌చ్చు.

రైతుల ధ‌ర హామీ , వ్య‌వ‌సాయ సేవ‌ల చ‌ట్టం ప్ర‌కారం వ్య‌వ‌సాయ సేవ‌ల కోసం ప్రాసెస‌ర్ లు, టోకు వ్యాపారులు,

పెద్ద చిల్ల‌ర వ్యాపారులు, ఎగుమ‌తి చేసే వారితో నిమ‌గ్నం అయ్యేలా రైతుల‌కు ర‌క్ష‌ణ , అధికారం క‌ల్పిస్తుంది.

ఎసెన్షియ‌ల్ క‌మోడిటీస్ చ‌ట్టం ప్ర‌కారం తృణ ధాన్యాలు, ప‌ప్పులు, బంగాళ దుంప‌లు, తిన‌ద‌గిన నూనె గింజ‌లు ,

నూనెల‌తో స‌హా ఆహార ప‌దార్థాల స‌ర‌ఫ‌రా అసాధార‌ణ‌మైన ప‌రిస్థితుల‌లో మాత్ర‌మే నియంత్రించ బ‌డుతుంద‌ని పేర్కొంది.

సాగు చ‌ట్టాల‌పై స్టే విధించ‌డంతో పంజాబ్, రాజ‌స్థాన్ , ఛ‌త్తీస్ గ‌ఢ్ , కేర‌ళ‌, ప‌శ్చిమ బెంగాల్ , ఢిల్లీ, త‌మిళ‌నాడు, త‌దిత‌ర రాష్ట్రాలు సాగు చ‌ట్టాలు ర‌ద్దు చేయాల‌ని తీర్మానం చేశాయి.

ఈ చ‌ట్టాలు రైతుల పాలిట ఉరితాళ్లుగా మారాయ‌ని, అంబానీ, అదానీల‌కు ల‌బ్ది చేకూర్చేలా ఉన్నాయంటూ రైతులు ఆందోళ‌న బాట ప‌ట్టారు.

చివ‌ర‌కు ఏడాది త‌ర్వాత తాము అనుకున్న‌ది సాధించారు.

Also Read : వింగ్ స్యూర్ ఇక బే ఫిక‌ర్

Leave A Reply

Your Email Id will not be published!