#ChinnaJeeyarSwamy : జ‌గ‌న్ ను క‌లిసిన చినజీయ‌ర్ స్వామి

రామానుజాచార్యుని ఉత్స‌వాల‌కు ఆహ్వానం

ChinnaJeeyar Swamy : ఆయ‌న జ‌గ‌మెరిగిన ఆధ్యాత్మిక వేత్త‌, గురు. వేలాది మంది భ‌క్తుల‌ను క‌లిగి ఉన్నారు. మోస్ట్ పాపుల‌ర్ స్వామిగా పేరొందారు. దేశంలోనే భారీ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు.

సుమారు వేయి కోట్ల రూపాయ‌ల దాకా వెచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇవాళ త్రిదండి చిన జీయ‌ర్ స్వామి (ChinnaJeeyar Swamy)వారు ఏపీ సీఎం సందిటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిశారు.

ఈ సంద‌ర్భంగా రామానుజాచార్యులు అవ‌త‌రించి ఈ భూమి మీద వేయి ఏళ్లు అవుతోంది. ఈ త‌రుణంలో హైద‌రాబాద్ శివారులోని ముచ్చింత‌ల్ ఆశ్ర‌మంలో స‌హస్రాబ్ది మ‌హోత్స‌వాలు నిర్వ‌హించాల‌ని త‌ల‌పెట్టారు.

ఇప్ప‌టికే త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ ను , భార‌త దేశ రాష్ట్ర ప‌తి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు, ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీతో పాటు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డిని క‌లిసి ఆహ్వానం ప‌లికారు. ఈసంద‌ర్బంగా ఇన్విటేష‌న్ల‌ను అంద‌జేశారు.

తాజాగా సీఎం జ‌గ‌న్ రెడ్డిని క‌లిశారు స్వామి వారు స్వ‌యంగా. రామానుజ స‌హ‌స్రాబ్ది ఉత్స‌వాల‌కు హాజ‌రు కావాల‌ని కోరారు. త‌న‌కు ఆహ్వానం ప‌లికేందుకు వ‌చ్చిన త్రిదండి చిన‌జీయ‌ర్ స్వామి వారికి ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు సీఎం జ‌గ‌న్ రెడ్డి.

సీఎం స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఇదిలా ఉండ‌గా రామానుజాచార్యుని స‌హ‌స్రాబ్ది ఉత్స‌వాలు వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 2 నుంచి 14 వ తేదీ దాకా జ‌ర‌గ‌నున్నాయి.

ఇందులో భాగంగా 1035 కుండ శ్రీ‌లక్ష్మీ నారాయ‌ణ మ‌హా క్ర‌తువు, 108 దివ్య దేశ ప్ర‌తిష్ట‌, కుంభాషికేం, స్వ‌ర్ణ‌మ‌య్య శ్రీ‌రామానుజ ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌నున్నారు.

Also Read : శ్రీ‌వారి భ‌క్తుల‌కు ఆర్టీసీ బంప‌ర్ ఆఫ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!