#AkhandaMovie : అఖండ మూవీకి లైన్ క్లియ‌ర్

డిసెంబ‌ర్ 2న విడుద‌ల‌కు సిద్దం

Akhanda Movie : బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో బాల‌కృష్ణ‌, ప్ర‌గ్యా జైస్వాల్ క‌లిసి న‌టించిన అఖండ మూవీ(Akhanda Movie) ఇప్ప‌టికే పూర్త‌యింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. మూవీకి సెన్సార్ బోర్డు స‌ర్టిఫికెట్ జారీ చేసింది.

ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించి విడుద‌లైన పాట‌లు, ట్రైల‌ర్ , పిక్ లు విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. డైలాగ్ కింగ్ గా పేరొందిన బాల‌కృష్ణ పేల్చిన డైలాగులు దుమ్ము రేపుతున్నాయి.

ఇక ఈ చిత్రంలో శ్రీ‌కాంత్ విలన్ గా న‌టిస్తుండ‌గా జ‌గ‌ప‌తి బాబు కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. డిసెంబ‌ర్ 2న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీకి ఎస్ ఎస్ థ‌మ‌న్ సంగీతం అందించారు. ద్వారకా క్రియేష‌న్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో మ‌రోసారి బాల‌య్య బాబుతో సినిమా తీస్తున్నారు. చిత్రానికి క‌థ‌, స్క్రీన్ ప్లే , ద‌ర్శ‌క‌త్వం బోయ‌పాటి చూస్తుండ‌డం విశేషం. ఇక సినిమాలో బాల‌కృష్ణ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు.

అఖండ మూవీని పెన్ స్టూడియోస్ పంపిణీ చేస్తోంది. దేశ వ్యాప్తంగా దీనిని రిలీజ్ చేయాల‌ని చూస్తోంది నిర్మాణ సంస్థ‌. అఖండ‌ను బోయ‌పాటి శ్రీ‌ను యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా తీర్చిదిద్దారు.

ప‌జ్ఞ జైస్వాల్ తో పాటు పూర్ణ‌, సునీల్ శెట్టి కూడా న‌టిస్తున్నారు. 2019లో డిసెంబ‌ర్ 6న అఖండ సినిమాను (Akhanda Movie)స్టార్ట్ చేశారు. రెగ్యుల‌ర్ షూటింగ్ మార్చి 2న రామోజీ ఫిల్మ్ సిటీలో మొద‌లైంది.

కరోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. తిరిగి 2020 అక్టోబ‌ర్ లో షూటింగ్ ప్రారంభమైంది. 2021 ఏప్రిల్ 13న అఖండ టైటిల్ ను అనౌన్స్ చేసి..టీజ‌ర్ ను రిలీజ్ చేశారు. క్లైమాక్స్ షూటింగ్ త‌మిళ‌నాడులో పూర్తి చేసుకుంది.

Also Read : కేసీఆర్ నిర్ణ‌యం ప్ర‌శంస‌నీయం – రామ్

Leave A Reply

Your Email Id will not be published!