#AdeebaRiyaz : అదీబా ‘జీల్ ఆఫ్ పెన్’ సంచ‌ల‌నం

11 ఏళ్ల వ‌య‌సు 11 రోజుల్లో పుస్త‌కం

Adeeba Riyaz : ఎవ‌రీ అదీబా రియాజ్ అనుకుంటున్నారా. నిత్యం తుపాకుల నీడ‌లో, తూటాల శ‌బ్ధాల మ‌ధ్య‌లో నివ‌సిస్తున్న సాధార‌ణ కుటుంబానికి చెందిన యువ‌తి. ఆమెకు 11 ఏళ్లు.

కానీ ఆమె అత్యంత పిన్న వ‌య‌సు క‌లిగిన ర‌చయిత్రిగా చ‌రిత్ర సృష్టించింది. కేవ‌లం 11 రోజుల్లోనే త‌న అనుభ‌వాల‌తో ఓ పుస్త‌కాన్ని రాసింది. ప్ర‌స్తుతం అది ప్ర‌పంచాన్ని త‌న వైపు చూసేలా చేసింది.

నిత్యం అల్ల‌క‌ల్లోలం. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌దు. ఉంటామో ఉండ‌మో సంక‌ట స్థితి. తాను ఏడ‌వ త‌ర‌గ‌తి చ‌దువుతోంది. కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన అదీబా రియాజ్ అతి త‌క్కువ స‌మ‌యంలో జీల్ ఆఫ్ పెన్ అనే పేరుతో పుస్త‌కాన్ని రాసింది.

96 పేజీలు ఉన్న ఈ పుస్త‌కం ఇప్పుడు అందుబాటులోకి వ‌చ్చింది. ఈ పుస్త‌కం పెద్ద ఎత్తున అమ్ముడు పోతోంది. ఈ వయ‌సులో పుస్త‌కం రాయాల‌న్న కోరిక ఎందుకు క‌లిగిందంటే.

కేవ‌లం తాను ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లేన‌ని చెబుతోంది అదీబా రియాజ్(Adeeba Riyaz). 2019లో అనంత్ నాగ్ జిల్లా అడ్మినిస్ట్రేష‌న్ ఆధ్వ‌ర్యంలో రైటింగ్ కాంపిటీష‌న్ నిర్వ‌హించారు.

అక్క‌డ త‌ను పాల్గొని బ‌హుమ‌తి గెలుచుకుంది. ఆనాడే ఓ పుస్త‌కం రాయాల‌ని అనుకుంది. ఇదే విష‌యాన్ని అదీబా రియాజ్ వెల్ల‌డించింది.

క‌శ్మీర్ లో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు చేసిన త‌ర్వాత‌, తాము ఉంటున్న ప్రాంతంలో క‌ర్ఫ్యూ విధించిన‌ప్పుడు, క‌రోనా కార‌ణంగా లాక్ డౌన్ విధించిన స‌మ‌యంలో తాను పుస్త‌కాన్ని రాశాన‌ని చెప్పింది.

అన్నింటికీ ఏదో ఉంది అనే అర్థం వ‌చ్చేలా ఈ పుస్త‌కాన్ని తీసుకు వ‌చ్చింది. ఇందులో లైఫ్ తో పాటు కొన్ని క‌వితలు కూడా ఉన్నాయి.

Also Read : ‘గురు ద్వారా’ ప్రార్థ‌న‌ల‌కు సిద్ధం

Leave A Reply

Your Email Id will not be published!