#Google : ‘క్రియేట‌ర్ల‌’కు గూగుల్ గుడ్ న్యూస్

కంటెంట్ ఉంటే చాలు కాసులే

Google  : ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ అన్న‌ట్టు కంటెంట్ ఉన్నోడికి క‌టౌట్ అవ‌స‌రం లేదు. ఇప్పుడు ప్ర‌పంచ టెక్ దిగ్గ‌జం గూగుల్(Google )సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ సంద‌ర్భంగా గుడ్ న్యూస్ చెప్పింది.

ప్ర‌త్యేకించి క్రియేట‌ర్ల‌కు, ఆలోచ‌నాల పరుల‌కు, కంటెంట్ క్రియేట‌ర్ల‌కు తీపి క‌బురు చెప్పింది గూగుల్. ఇక నుంచి కంటెంట్ ఉంటే చాలు గూగుల్ అనుబంధ సంస్థ యూట్యూబ్ లో దుమ్ము లేపొచ్చు.

ఇక నుంచి క్రియేట‌ర్ల‌కు శుభ‌వార్త చెప్పింది. ఇక మీద‌ట టిక్ టాక్ , రీల్స్ కు పోటీగా యూట్యూబ్ లో సైతం షార్ట్ టైమ్ డ్యూరేష‌న్ ఉన్న వీడియోల‌ను చేసేందుకు వీలు క‌ల్పించింది.

ఈ మేర‌కు భార‌త్ లో షార్ట్స్ టైమ్ డ్యూరేష‌న్ పై యూట్యూబ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. దీంతో ఇక నుంచి క్రియేట‌ర్ల‌కు ఇది బిగ్ చాన్స్ గా పేర్కొనవ‌చ్చు. భార‌త్ లో చైనాకు చెందిన టిక్ టాక్ పై బ్యాన్ చేసింది.

వాటికంటే ఎక్కువ‌గా ఫీచ‌ర్స్ తో యూట్యూబ్ లో వీడియోస్ క్రియేట్ చేసి అద‌ర గొట్ట‌వ‌చ్చు. ఇదే స‌మ‌యంలో గ‌త ఏడాది 2020 సెప్టెంబ‌ర్ లో గూగుల్(Google )యూట్యూబ్ షార్ట్స్ ను అందుబాటులోకి తెచ్చింది.

గ‌తంలో 60 సెక‌న్లు ఉండేది. కానీ ఇక‌పై అంత వ్య‌వ‌ధితో ప‌ని లేదు. కేవ‌లం 15 సెక‌న్లు లేదా అంత కంటే త‌క్కువ వ్య‌వ‌ధి ఉన్న వీడియోల‌ను సైతం క్రియేట్ చేయొచ్చంటూ గూగుల్ వెల్ల‌డించింది.

క్రియేట‌ర్లే కాకుండా యూట్యూబ్ ఛాన‌ల్ నిర్వాకులు ఫుల్ సంతోషంతో ఉన్నారు. వీటి ద్వారా ఛాన‌ల్ బ్రాండింగ్ కూడా చేసుకునే వీలు క‌లుగుతుంది.

Also Read : డేటా ‘డౌన్ లోడ్’ లో ‘జియో’ టాప్

Leave A Reply

Your Email Id will not be published!