#Samantha : ‘ఐఎఫ్ఎఫ్ఐ’లో స‌మంత హ‌ల్ చ‌ల్

సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారిన న‌టి

Samantha : గోవాలో స‌మంత సంద‌డి చేస్తోంది. 52వ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా ఉత్స‌వాలు జ‌రుగుతున్నాయి. ఇవి 9 రోజుల పాటు కొన‌సాగ‌నున్నాయి.

క‌రోనా త‌ర్వాత గోవా స‌ర్కార్, కేంద్ర స‌మాచార‌, ప్ర‌సార మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్నాయి. ఈ వేడుక‌ల్లో సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా నిలిచారు ప్ర‌ముఖ న‌టి సమంత‌(Samantha).

ఆమె ఇటీవ‌లే నాగ చైత‌న్య‌తో విడాకులు తీసుకున్నారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌ముఖ నిర్మాత క‌ర‌ణ్ జోహార్ , మ‌నీష్ పాల్ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్ 2 ద‌ర్శ‌కులు రాజ్ అండ్ డీకే టీమ్ తో క‌లిసి సంద‌డి చేసింది.

ఈ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ కు ప్ర‌ధానంగా ద‌క్షిణాది నుంచి ప్ర‌సంగించేందుకు చాన్స్ ఇచ్చారు న‌టి స‌మంత‌కు. ఈ సంద‌ర్భంగా సినిమా తీరు తెన్నుల‌పై చ‌ర్చ జ‌రిగింది.

ఇందులో అమెజాన్ ఇండియా ఒరిజ‌న‌ల్స్ కు హెడ్ గా ఉన్న రోహిత్ పాల్గొన్నారు. తెలుగు ప‌రిశ్ర‌మ, హైద‌రాబాద్ త‌న‌కు పుట్టినిల్లు అంటూ చెప్పారు న‌టి స‌మంత‌(Samantha).

ఇదిలా ఉండ‌గా అరుణా రాజే, జాన్ ఎడ‌త‌త్తిల్ , మ‌నోజ్ వాజ్ పేయ్ , వివేక్ అగ్నిహోత్రి పాల్గొన్నారు. కాగా త‌న జీవితంలో , కెరీర్ లో ఈ ఫెస్టివ‌ల్ ను మ‌రిచి పోలేని రోజుగా అభివ‌ర్ణించింది.

ఈవెంట్ కు సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఇక ఈ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఈనెల 28 వ‌ర‌కు కొన‌సాగ‌నుంది.

అయితే ప్ర‌స్తుతం స‌మంత త‌మిళ మూవీలో న‌టిస్తోంది. ఈ చిత్రానికి విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో స‌మంత‌తో పాటు న‌య‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తి న‌టిస్తున్నారు.

Also Read : మ‌న‌సు నొప్పిస్తే మ‌న్నించండి – జ్ఞాన‌వేల్

Leave A Reply

Your Email Id will not be published!