#ShilpaShetty : పెళ్లి నాటి జ్ఞాప‌కం ప‌దిలం

గుర్తు చేసుకున్న శిల్పా శెట్టి

Shilpa Shetty : వాళ్లిద్ద‌రూ అనుకోకుండా క‌లుసుకున్నారు. ఒక‌రు బాలీవుడ్ న‌టి శిల్పా శెట్టి కాగా మ‌రొక‌రు వ్యాపారవేత్త రాజ్ కుంద్రా. ఇద్ద‌రూ ఇప్పుడు వివాదాల్లో చిక్కుకున్నారు.

ఒక‌రు ఫిట్ నెస్, స్పా , యోగా పేరుతో మోసం చేశార‌ని శిల్పా శెట్టిపై (Shilpa Shetty) ఫిర్యాదు చేస్తే మ‌రొక‌రు ఏకంగా బ్లూ ఫిలింలు త‌యారు చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌ల‌పై రెండు నెల‌ల పాటు జైలుకు వెళ్లి ఇటీవ‌లే బెయిల్ పై విడుద‌ల‌య్యారు.

ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలు హాట్ టాపిక్ గా మారారు.

ఇదిలా ఉండ‌గా ఇవాళ వివాహ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా శిల్పా శెట్టి తామిద్ద‌రి పెళ్లినాటి ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకుంది.

ఆనాటి జ్ఞాప‌కం ఇప్ప‌టికీ ప‌దిలంగా ఉంద‌ని పేర్కొంది.

ఈ సంద‌ర్భంగా శిల్పా శెట్టి (Shilpa Shetty) దంప‌తుల‌కు పెద్ద ఎత్తున శుభాకాంక్ష‌లు వెళ్లువెత్తుతున్నాయి.

వీరిద్ద‌రూ స‌రిగ్గా ఇదే రోజున 12 ఏళ్ల కింద‌ట ఒక్క‌ట‌య్యారు. రాజ్ కుంద్రా కు శిల్పా శెట్టి రెండో భార్య‌. ఆయ‌న త‌న మొద‌టి భార్య‌కు విడాకులు ఇచ్చారు.

ఈ సంద‌ర్భంగా శిల్పా శెట్టి త‌న వివాహం జ‌రిగిన అరుదైన ఫోటోల‌ను పంచుకున్నారు. మేమిద్దరం క‌లిసి ఉండాల‌ని అనుకున్నాం. ఆ మేర‌కు మా ప్ర‌యాణం సాగించాం.

ఈ ప్ర‌యాణంలో ఎన్నో ఆటుపోట్లు. మ‌రెన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. స‌మాజం నుంచి మాకు కొంత వ్య‌తిరేక‌త ఎదురైంది. దానిని కూడా చివ‌ర‌కు త‌ట్టుకుని నిల‌బ‌డ‌గ‌లిగాం. భ‌గ‌వంతుడు మాకు ధైర్యాన్ని ఇచ్చాడు.

ఈ జ‌ర్నీలో క‌న్నీళ్ల‌తో పాటు కాస్తంత న‌వ్వులు, ప‌ల‌క‌రింత‌లే కాదు పుల‌క‌రింత‌లు కూడా ఉన్నాయి. క‌ష్టాలు ఎక్కువ కాలం ఉండ‌వు అన్న‌ది నా న‌మ్మ‌కం.

ఆ దిశ‌గానే నా ప్ర‌యాణం సాగుతుంద‌ని అనుకుంటాన‌ని పేర్కొంది శిల్పా శెట్టి. ఇప్పుడు మాకు విలువైన వ‌స్తువులు మా పిల్ల‌లు మాత్ర‌మేన‌ని తెలిపింది.

Also Read : చైతూ మెచ్చిన ‘గ్రీన్ లైట్స్’

Leave A Reply

Your Email Id will not be published!