#Xiaomi : జియోతో షావోమీ ఒప్పందం

త్వ‌ర‌లో 5జీ ఫోన్ తో మార్కెట్ లోకి

Xiaomi : ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ ల త‌యారీ సంస్థ షావోమీ(Xiaomi) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు భార‌తీయ మార్కెట్ లో టాప్ లో ఉన్న రిల‌య‌న్స్ జియో కంపెనీతో జ‌త క‌ట్ట‌నుంది.

ఈ మేర‌కు అధికారికంగా ఇవాళ ప్ర‌క‌ట‌న చేసింది. దేశీయ స్మార్ట్ ఫోన్ ల మార్కెట్ లో షావోమీ టాప్ లో ఉంది. మిగ‌తా వాటి కంటే ముందంజ‌లో కొన‌సాగుతోంది.

అంతే కాకుండా ఇటీవ‌ల రిలీజ్ చేసిన క్యూ3 స్మార్ట్ ఫోన్ ఫ‌లితాల్లో షావోమీ 22 శాతం తో అగ్ర స్థానంలో నిలిచింది. ఆ స్థానం కోల్పోకుండా ఉండేందుకు మ‌రింత మార్కెట్ పెంచుకునేందుకు కొత్త దారులు వెతుకుతోంది.

అంతే కాకుండా గ‌ణ‌నీయంగా విస్త‌రించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందుకు సరైన వేదిక‌గా రిల‌య‌న్స్ జియోను ఎంచుకుంది. ఈ మేర‌కు స‌ద‌రు సంస్థ‌తో ఒప్పందం చేసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించింది.

రోజుల వ్య‌వ‌ధిలోనే ప‌లు బ్రాండ్ ల‌ను విడుద‌ల చేస్తూ వ‌స్తోంది షావోమీ. ప్ర‌స్తుతం వ‌ర‌ల్డ్ వైడ్ మార్కెట్ అంతా 5జీ స్మార్ట్ ఫోన్ల‌కే ఎక్కువ‌గా డిమాండ్ ఉంటోంది.

దీంతో వాటిని అమ్ముకోవాలంటే ఎక్కువ క‌నెక్టివిటీ క‌లిగిన కంపెనీ అయితే బెట‌ర్ అని భావించింది స‌ద‌రు చైనా సంస్థ షావోమీ.

ఇప్ప‌టికే ప్ర‌పంచాన్ని శాసిస్తూ వ‌చ్చిన ఆపిల్ , శాంసంగ్ , త‌దిత‌ర కంపెనీల‌కు ఝ‌ల‌క్ ఇస్తూ వ‌చ్చింది అతి త‌క్కువ కాలంలోనే షావోమీ.

ప్ర‌పంచంలో ఏ కంపెనీ అయినా త‌మ మార్కెట్ పెంచుకునేందుకు భార‌త్ పైనే ఆధార ప‌డుతున్నాయి. ఎందుకంటే ఇక్క‌డ నెట్ క‌నెక్టివిటీతో పాటు స్మార్ట్ ఫోన్ల వినియోగం ఎక్కువ‌గా ఉంది.

మొత్తంగా జియోతో ఒప్పందం మేర‌కు త్వ‌ర‌లో కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ల‌ను అందుబాటులోకి తీసుకు రానుంది.

Also Read : ‘ఇమేజ్’ లో తెలంగాణ ఫేమ‌స్

Leave A Reply

Your Email Id will not be published!