#TNCricketersDance : ‘మాస్ట‌ర్ సాంగ్’ తో క్రికెట‌ర్ల డ్యాన్స్

త‌మిళ‌నాడు ప్లేయ‌ర్ల జోష్

TN Cricketers Dance : త‌మిళ‌నాడులోనే కాదు యావ‌త్ భార‌త దేశ సినీ ప‌రిశ్ర‌మ‌లో మోస్ట్ పాపుల‌ర్ హీరోగా ఇల‌య త‌ళ‌ప‌తి విజ‌య్ కు పేరుంది. ఆయ‌న న‌టించిన మాస్ట‌ర్ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. క‌రోనా కాలంలో సైతం వ‌సూళ్లలో దుమ్ము రేపింది.

ఇందులో విజ‌య్ తో పాటు అందాల ముద్దు గుమ్మ మాళ‌విక మోహ‌న్ జంట‌గా న‌టిస్తే ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌లో విజ‌య్ సేతుప‌తి న‌టించాడు. ఇక ఈ సినిమాకు అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందించాడు.

ఆయ‌న అందించిన పాట‌లు రికార్డులు బ్రేక్ చేశాయి. ఇదిలా ఉండ‌గా తాజాగా విజ‌య్ దుమ్ము రేపిన ఆ పాట‌కు గ‌తంలో ఎంతో మంది ఆట‌గాళ్లు డ్యాన్స్ ల‌తో అద‌ర‌గొట్టారు.

తాజాగా త‌మిళ‌నాడు జ‌ట్టు ఊహించ‌ని రీతిలో క‌ర్ణాట‌క‌తో జ‌రిగిన మ్యాచ్ లో విజ‌యం సాధించి స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీని చేజిక్కించుకుంది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున సెల‌బ్రేష‌న్స్ చేసుకుంది.

మ‌రో వైపు ఇప్ప‌టికే ఐపీఎల్ లో ప్రాతినిధ్యం వ‌హిస్తున్న త‌మిళ‌నాడుకు చెందిన స్టార్ ప్లేయ‌ర్ షారుఖ్ ఖాన్ దుమ్ము రేపాడు. ఆఖ‌రి బంతికి 5 ప‌రుగులు కావాల్సిన స‌మ‌యంలో భారీ సిక్స్ తో త‌న జ‌ట్టుకు చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాన్ని అందించాడు.

అంతే కాదు 15 బంతులు ఆడి 33 ప‌రుగులు చేసి అజేయంగా నిలిచాడు. అత‌డు సిక్స్ కొట్ట‌డాన్ని చెన్నై సూప‌ర్ కింగ్స్(TN Cricketers Dance) కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ చూస్తుండ‌గా తీసిన ఫోటో వైర‌ల్ గా మారింది.

అనంత‌రం ట్రోఫీతో త‌మిళనాడు ఆట‌గాళ్లు డ్రెస్సింగ్ రూమ్ లో మాస్ట‌ర్ పాట‌కు డ్యాన్సుల‌తో అద‌ర‌గొట్టారు. ఇప్పుడు వీడియో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

Also Read : ‘ఖాన్’ ఖ‌త‌ర్నాక్ సిక్స్ త‌మిళ‌నాడుదే క‌ప్

Leave A Reply

Your Email Id will not be published!