#FarmersFight : రాబోయే ఎన్నిక‌ల్లో రైతులే కీల‌కం

సాగు చ‌ట్టాల ర‌ద్దు ఎవ‌రికి ప్ర‌యోజ‌నం

Farmers Fight : ఇటు దేశాన్ని అటు ప్ర‌పంచాన్ని త‌మ వైపు చూసేలా చేసిన అరుదైన ఉద్య‌మం రైతుల పోరాటం. సుదీర్ఘ పారాటం చేసిన చ‌రిత్ర ఇటీవ‌ల కాలంలో అరుద‌నే చెప్ప‌క త‌ప్ప‌దు. గ‌తంలో ఎన్నో ఉద్య‌మాలు జ‌రిగాయి.

కానీ ఎక్క‌డా పుల్ స్టాప్ అంటూ లేకుండానే నాన్ స్టాప్ గా న‌డుస్తున్న ఆందోళ‌న ఏదైనా ఉంది అంటే అది రైతుల పోరాట‌మే.

దేశ వ్యాప్తంగా త‌మ ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్ట‌డంలో, అంచెలంచెలుగా త‌మ పంథాను గ‌తి త‌ప్ప‌కుండా చేయ‌డంలో వాళ్లు స‌క్సెస్ అయ్యారు.

మోదీ సార‌థ్యంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ స‌ర్కార్ సాగు చ‌ట్టాల‌ను తీసుకు వ‌చ్చింది.

ఈ చ‌ట్టాలు రైత‌ల‌కు ప్ర‌యోజ‌నం (Farmers Fight)క‌లిగించేందుకేన‌ని స్ప‌ష్టం చేసింది ప్ర‌భుత్వం.

కానీ అవి త‌మ కోసం కాద‌ని అంబానీ, అదానీల‌ను క‌ట్ట బెట్టేందుకేనంటూ రైతులు దుమ్మెత్తి పోశారు.

మోదీని టార్గెట్ చేశారు. స్ప‌ష్ట‌మైన కార్య‌చ‌ర‌ణ ప్ర‌క‌టించారు. కేంద్రం దిగి వ‌చ్చేంత దాకా త‌మ పోరాటం ఆప‌బోమంటూ ప్ర‌క‌టించారు.

అందుకు త‌గిన‌ట్లుగానే ఆందోళ‌న సాగించారు. ఇందులో ఎన్నో ఆటుపోట్లు ఉన్నాయి.

అంత‌కు మించి మ‌రిచి పోలేని క‌న్నీళ్లు ఉన్నాయి. చ‌లికి వ‌ణికారు. ఎండ‌కు ఎండారు. గుడిసెలు వేసుకున్నారు.

కేసులు న‌మోదు చేసినా భ‌రించారు. లాఠీఛార్జీ ప్ర‌యోగించినా త‌ట్టుకున్నారు. చివ‌ర‌కు వాహ‌నాల‌తో తొక్కించినా, క‌ళ్ల ముందే దౌర్జ‌న్యం చేసినా మిన్న‌కుండి పోయారు.

వారి సంక‌ల్పం ముందు కేంద్రం లొంగి పోయింది. దాని వెనుక రాజ‌కీయాలు ఉండి ఉండ‌వ‌చ్చు. కాద‌న‌లేం.

ఒక దేశానికి ప్రాతినిధ్యం వ‌హించే అత్యున్న‌త ప‌ద‌వి క‌లిగిన ప్ర‌ధాన‌మంత్రి స్వత‌హాగా తాము తీసుకు వ‌చ్చిన చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకుంటున్నామ‌ని ప్ర‌క‌టించాడు.

జాతిని ఉద్దేశించి బ‌హింరంగ క్ష‌మాప‌ణ వేడుకున్నాడు. ఇది చాల‌దా రైతుల విజ‌యానికి.

వారి పోరాటానికి. వారి నిలువెత్తు త్యాగానికి. ఖ‌లిస్తాన్ వాదులు అంటే ప‌డ్డారు.

దేశ ద్రోహుల‌ని ముద్ర వేస్తే క్ష‌మించారు. అన్ని వైపుల నుంచి దాడులు చేసినా ఎక్క‌డా త‌గ్గ లేదు. ముందుకే సాగారు.

దీని వెనుక మేధావులు ఉన్నారు. ప్ర‌జా సంఘాలు ఉన్నాయి.

అన్నిటి కంటే రైతు సంఘా ల నాయ‌కులు ఉన్నారు. మొత్తంగా చూస్తే ఇప్పుడు దేశ వ్యాప్తంగా రైతులు చేప‌ట్టిన ఉద్య‌మం

చ‌రిత్రాత్మ‌క‌మే కాదు రాబోయే ఏ ఎన్నిక‌ల్లోనైనా వారే కీల‌కం కాబోతున్నార‌నేది వాస్త‌వం.

అందుకే పార్టీల‌న్నీ ఇప్పుడు రైతుల జ‌పం(Farmers Fight) చేస్తున్నాయి. వ్య‌వ‌సాయ రంగ‌మే ముఖ్య‌మ‌ని కొత్త రాగం ఆలాపిస్తున్నాయి.

కానీ వారి మ‌న‌సులో ఏముందో అన్న‌ది ఎవ‌రికి ఎరుక‌. అది తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.

Also Read : సోషలిజం నుంచి హిందుత్వ వైపు

Leave A Reply

Your Email Id will not be published!