#BasavarajBommai : సోషలిజం నుంచి హిందుత్వ వైపు

క‌ర్ణాట‌క సీఎం ప్ర‌జా ప్ర‌స్థానం

Basavaraj Bommai  : క‌ర్ణాట‌క భార‌తీయ జ‌న‌తా పార్టీలో ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో బ‌స‌వ‌రాజ సోమ‌ప్ప బొమ్మై సీఎం అవుతార‌ని. కాలం క‌లిసొస్తే ఎప్పుడు ఎవ‌రిని ఆ ప‌ద‌వి వ‌రిస్తుందో చెప్ప‌లేం.

ఆయ‌న ఆలోచ‌నా ప‌ర‌డు. అంత‌కంటే లోతైన సునిశిత‌మైన వ్య‌క్తిగా పేరొందారు.

బ‌య‌ట‌కు మెత‌క వైఖ‌రి క‌నిపించినా త‌రిచి చూస్తే బొమ్మై(Basavaraj Bommai )హిందూత్వ పార్టీగా ముద్ర వేసుకున్న కాషాయ ద‌ళంలో భిన్న‌మైన నాయ‌కుడు.

ఉన్న‌త మైన ప‌ద‌విని అలంక‌రించిన వెంట‌నే మిగ‌తా నాయ‌కులు,

శ్రేణులు త‌న గురువుగా భావించే మాజీ సీఎం బీఎస్ యెడియూర‌ప్ప లాగానే బొమ్మై లొంగి పోతార‌ని అంతా అనుకున్నారు.

కానీ మెల మెల్ల‌గా ఆయ‌న త‌న‌దైన శైలిలో ముద్ర వేస్తూ వ‌స్తున్నారు. పాల‌నా ప‌రంగా కొంత స‌మ‌యం ప‌ట్ట‌వ‌చ్చు.

కానీ స్పందించే తీరును బ‌ట్టే, తీసుకునే నిర్ణ‌యాల‌ను బట్టే వారి గ్రాఫ్ పెరుగుతుందా లేదా అన్న‌ది చెప్ప‌వ‌చ్చు.

పార్టీలో బొమ్మై మిత‌వాద ముఖంగా క‌నిపించారు. త‌న‌ను తాను మార్చుకుంటూ వ‌స్తున్నారు. ఇది నాయ‌కుడికి ఉండాల్సిన ప్ర‌ధాన ల‌క్ష‌ణం.

బ‌య‌టి వారికి అది కొంత ఎబ్బెట్టుగా అనిపించినా ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో

ఇది అత్యంత అవ‌స‌రం కూడా. అందుకే బొమ్మై త‌న శైలికి భిన్నంగా వెళుతున్న‌ట్లు అనిపిస్తోంది.

ఇక బొమ్మైకి మెరుగైన రాజ‌కీయ వార‌స‌త్వం ఉంది. ఆయ‌న తండ్రి ఎస్ఆర్ బొమ్మై సీఎంగా ప‌ని చేశారు. ఆయ‌న జ‌న‌తా పార్టీకి ప్రాతినిధ్యం వ‌హించారు.

పూర్తిగా రాజ‌కీయ భావ‌జాలం సోష‌లిజం, సెక్యుల‌రిజంతో పాతుకు పోయింది.

దేశ రాజ‌కీయాల‌లో త‌న‌దైన ముద్ర వేసి న‌డిపించిన నాయ‌కుడు ఎం.ఎన్ రాయ్. ఆయ‌న అనుచ‌రుడిగా ఎస్ఆర్ బొమ్మై పేరొందారు.

రాడిక‌ల్ డెమోక్ర‌టిక్ పార్టీ నుంచి రాజ‌కీయ జీవితాన్ని ప్రారంభించాడు.

భార‌త‌దేశ మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రిగా ప‌ని చేశారు బొమ్మై తండ్రి. విద్య‌ను ప్రాథ‌మిక హ‌క్కుగా ప్ర‌వేశ పెట్టిన వ్య‌క్తిగా ఘ‌నత పొందారు.

కొన్నేళ్ల త‌ర్వాత 2010లో కార్య‌రూపం దాల్చింది. ఆనాటి క‌ర్ణాట‌క గ‌వ‌ర్న‌ర్ ను ఆయ‌న నిల‌దీయ‌డంతో దేశ వ్యాప్తంగా పేరొందారు.

అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకునే చాన్స్ ఇవ్వ‌కుండానే స‌ర్కార్ ను ర‌ద్దు చేశారు ఆనాటి గ‌వ‌ర్న‌ర్ వెంక‌ట సుబ్బ‌య్య‌.

దీనిని స‌వాల్ చేస్తూ కోర్టులో దాఖ‌లైన కేసులో 1994లో చ‌రిత్రాత్మ‌క తీర్పు వెలువ‌డింది.

ఎన్నికైన రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని తొల‌గించే లేదా బ‌ర్త‌ర‌ఫ్ చేసే రాష్ట్ర‌ప‌తికి ఉన్న అధికారం సంపూర్ణం కాద‌ని,

దేశంలో ఫెడ‌ర‌లిజానికి ఇది కీల‌క‌మైన సూచ‌న అని తీర్పు వ‌చ్చింది.

ఇది దేశ ప్ర‌జాస్వామ్య చ‌రిత్ర‌లో కీల‌క తీర్పుగా పేర్కొనవ‌చ్చు. కాగా యువ నాయ‌కుడిగా ప్ర‌స్తుత సీఎం బొమ్మై (Basavaraj Bommai )త‌న తండ్రి అడుగు జాడ‌ల్లో న‌డిచారు.

సామ్య‌వాద సూత్రాల‌ను పాటించారు. జ‌నతా పార్టీ ఉన్న స‌మ‌యంలో బొమ్మై 1998లో ఒక‌సారి, 2004లో రెండు సార్లు ఎమ్మెల్సీగా ఎన్నిక‌య్యారు.

ఆనాటి సీఎం జీహెచ్ ప‌టేల్ కు రాజ‌కీయ కార్య‌ద‌ర్శిగా కూడా ప‌ని చేశారు.

దేవె గౌడ‌, సిద్ద రామయ్య‌, సురేంద్ర మోహ‌న్ , మ‌ధు దండావ‌తె పాటు ఎస్ ఆర్ బొమ్మై చాలా విష‌యాల‌లో వామ‌ప‌క్షంగా ఉన్నారు.

అదే స‌మ‌యంలో త‌న తండ్రికి సపోర్ట్ గా నిలిచాడు బ‌స‌వ‌రాజ బొమ్మై.

ఆయ‌న ఎమ్మెల్సీగా ఉన్న‌ప్పుడు బీజేపీని విమ‌ర్శించారు. తండ్రి లోహియా ఉద్య‌మానికి అండ‌గా నిలిచారు.

బొమ్మై కూడా. కానీ ఇప్పుడు ఆయ‌న పూర్తిగా మారి పోయార‌ని చెప్ప‌డానికి వీలు లేదంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

2008కి ముందు ఆయ‌న ఏ పార్టీలో చేరాల‌ని ఊగిస లాడారు.

చివ‌ర‌కు బీజేపీని ఎంచుకున్నారు. ఆ త‌ర్వాత ఎన్నో కీల‌క ప‌ద‌వులు నిర్వ‌హించారు.

మొత్తంగా ఇప్పుడు బొమ్మై (Basavaraj Bommai )సోష‌లిజం, హిందూత్వం క‌లిసిన నాయ‌కుడు.

Also Read : సోషలిజం నుంచి హిందుత్వ వైపు

Leave A Reply

Your Email Id will not be published!