#InzamamUlHaq : బంగ్లా క్రికెట్ బోర్డుపై ‘హ‌క్’ ఫైర్

ఇక‌నైనా మార్పులు చేయండి

Inzamam UlHaq  ; బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీరుపై పాకిస్తాన్ మాజీ సార‌థి ఇంజ‌మామ్ ఉల్ హ‌క్ నిప్పులు చెరిగాడు. తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. బోర్డు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు, జ‌ట్టును ఎంపిక చేస్తున్న వైనాన్ని త‌ప్పు ప‌ట్టాడు.

అస‌లు మీరు బోర్డులో ఉండి ఏం చేస్తున్నారో నాకు అర్థం కావ‌డం లేదు. గ‌త కొంత కాలం నుంచి ఒకే జ‌ట్టును మీరు రంగంలోకి దించుతున్నారు. దీని వ‌ల్ల వాళ్లు స‌రైన ప‌ర్ ఫార్మెన్స్ చేయ‌లేక పోతున్నారు.

ఇప్ప‌టికే పాకిస్తాన్ క్లీన్ స్విప్ చేసింది. ఎంతో మంది కొత్త వాళ్లు ఉన్నారు. అలాంట‌ప్పుడు వారిని ఎందుకు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌డం లేదంటూ నిల‌దీశాడు ఇంజ‌మామ్ ఉల్ హ‌క్(Inzamam UlHaq ). ప్ర‌తి జ‌ట్టు సంపూర్ణంగా ఆడాల‌నే అనుకుంటుంది.

ఇందుకు ప‌రిస్థితులు కూడా అనుకూలించాల్సి ఉంటుంది. అది త‌ర్వాతి విష‌యం. ముందుగా మీ జ‌ట్టు ఎలా ఉందో ఎప్పుడైనీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప‌రిశీలించిందా అని ప్ర‌శ్నించారు.

జ‌ట్టు ఆట తీరు గురించి రివ్వూ చేశారా అని మండిప‌డ్డారు. ఎన్నో విజ‌యాలు సాధించిన భార‌త జ‌ట్టు సైతం ఇప్పుడు కొత్త కోచ్ ను నియ‌మించింది. వాళ్లు కూడా జ‌ట్టులో పెను మార్పులు తీసుకు వ‌చ్చారు.

ఒక‌రు ఆడ‌క పోతే మ‌రొక‌రిని చేరుస్తున్నారు. మొత్తంగా మ‌ళ్లీ గాడిన పెట్టేందుకు య‌త్నిస్తున్నారు. కానీ బంగ్లాదేశ్ బోర్డు మాత్రం చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రించ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నాడు ఇంజ‌మామ్ ఉల్ హ‌క్(Inzamam UlHaq ).

ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌కు అనుగుణంగా జ‌ట్టులో వెంట‌నే మార్పులు చేయాల‌ని సూచించాడు. లేక పోతే బంగ్లాదేశ్ మ‌రింత అట్ట‌డుగున ఉండే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించాడు.

Also Read : విజ‌య గ‌ర్వం త‌ల‌కెక్కితే ప్ర‌మాదం

Leave A Reply

Your Email Id will not be published!