#DataProtectionBill : సోష‌ల్ మీడియాకు ముకుతాడు

పీడీపీ బిల్లుకు కేంద్రం ఆమోదం

Data Protection Bill  : సుదీర్ఘ కాలంగా చ‌ర్చోప చ‌ర్చ‌లు జ‌రుగుతూ వ‌స్తున్నాయి. సామాజిక మాధ్య‌మాల‌పై నియంత్ర‌ణ అవ‌స‌రం అన్న‌ది ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. దీనిపై తాము మీ ప‌రిధిలోకి రామంటూ భీష్మించుకు కూర్చుకున్నాయి కొన్ని సంస్థ‌లు.

కానీ భార‌త్ మాత్రం త‌మ ప‌రిధిలో ఉండాల‌ని కోరుతోంది. ఈ మేర‌కు ఇప్ప‌టికే ఝ‌ల‌క్ ఇచ్చింది కూడా. ఇక్క‌డ వ్యాపారం చేసుకుంటూ మేం సామాజిక సేవ చేస్తామంటూ ఎవ‌రూ న‌మ్మ‌బోరంటూ ఇప్ప‌టికే గ‌ట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చింది.

ఇందుకు సంబంధించి ఓ వైపు ఓటీటీ ప్లాట్ ఫామ్ పేరుతో విచ్చ‌ల విడిగా బూతు రాజ్యం ఏలుతోంది. మ‌రో వైపు సామాజిక మాధ్య‌మాలు త‌మ ప‌రిధి దాటి దేశాన్ని శాసించే స్థాయికి చేరుకున్నాయి.

ఈ త‌రుణంలో కేంద్రం జాయింట్ పార్ల‌మెంట‌రీ క‌మిటీ – జేపీసీని ఏర్పాటు చేసింది. చివ‌ర‌కు రెండేళ్ల త‌ర్వాత వ్య‌క్తిగ‌త డాటా ప‌రిర‌క్ష‌ణ – పీడీపీ బిల్లుపై(Data Protection Bill )ఆమోదం తెలిపింది కేంద్ర స‌ర్కార్.

ఫేస్ బుక్, ట్విట్ట‌ర్, పింటా రెస్ట్, లింక్డ్ ఇన్, త‌దితర వ‌న్నీ సామాజిక మాధ్య‌మాల కింద‌కే చేర్చాల‌ని సిఫార‌సు చేసింది. ఈ ప్ర‌తిపాదిత చ‌ట్టం కింద‌కు తీసుకు రావాల‌ని కోరింది.

ఇందులో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వానికి, పోలీస్, సిబీఐ, ఈడీ, రా, ఐబీ, యూఐడీఏఐ వంటి కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు మిన‌హాయింపు ఇవ్వాల‌ని సూచించింది.

దేశ భ‌ద్ర‌త , ప్ర‌జా సంక్షేమం విష‌యంలో న్యాయ‌మైన ప‌ద్ద‌తులు పాటించ‌న‌ప్పుడు మాత్ర‌మే ఈ మిన‌హాయింపు వ‌ర్తింప చేయాల‌ని తెలిపింది. ఈ నెల 29న ప్రారంభ‌మ‌య్యే పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు రానుంది.

Also Read : క్రియేట‌ర్ల‌’కు గూగుల్ గుడ్ న్యూస్

Leave A Reply

Your Email Id will not be published!