#AnilRavipudi : హాస్యం లేకుంటే లైఫ్ బోర్

వినోదానికే ప్ర‌యారిటీ

Anil Ravipudi  : జీవితం పండాలంటే వినోదం ఉండాల్సిందే. కాస్తంత హాస్యం అన్న‌ది లేక పోతే లైఫ్ కు అర్థం అంటూ ఉండ‌దంటారు మినిమం గ్యారెంటీ ద‌ర్శ‌కుడిగా పేరొందిన అనిల్ రావిపూడి. ఆయ‌న చేసింది కొన్ని సినిమాలే.

కానీ అవ‌న్నీ సూప‌ర్ హిట్లే. ఇవాళ ఈ న‌వ్వులు పూయించే ద‌ర్శ‌కుడి జ‌న్మ‌దినం. ఆయ‌న వెంక‌టేశ్ , వ‌రుణ తేజ్, త‌మ‌న్నా, మెహ్రీన్ తో తీసిన ఎఫ్2 మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది.

దీనికి నిర్మాత దిల్ రాజు. దీంతో ఆ సినిమాతో వ‌చ్చిన కిక్ తో దానికి సీక్వెల్ గా ఎఫ్3 తీస్తున్నారు. దానికంటే ఎక్కువ‌గా వినోదాన్ని, హాస్యాన్ని ఇస్తుందంటున్నారు అనిల్ రావిపూడి(Anil Ravipudi ).

ప్రేక్ష‌కుల అంచ‌నాకు మించి ఉంటుందని చెప్పారు. ఒక ర‌కంగా చెప్పాలంటే డైరెక్ట‌ర్ గా ఇది నా ఆరో బ‌ర్త్ డే అన్నారు. ముందుగా అనుకున్న‌ట్లు ఈసారి సంక్రాంతికి విడుద‌ల చేద్దామ‌ని అనుకున్నాం.

కానీ కొంత ఆల‌స్యం అవుతున్నందుకు బాధ‌గా ఉంద‌న్నారు అనిల్ రావిపూడి(Anil Ravipudi ). వ‌చ్చే ఫిబ్ర‌వ‌రి 25న రిలీజ్ చేస్తామ‌ని తెలిపారు. ఇప్ప‌టికీ ఎఫ్3 80 శాతం పూర్త‌యింద‌ని చెప్పారు.

కొంత టాకీ, రెండు పాట‌లు చిత్రీక‌రించాల్సి ఉంద‌న్నారు. విచిత్రం ఏమిటంటే ఎఫ్2 భార్య భ‌ర్త‌ల ఫ్ర‌స్ట్రేష‌న్ నేప‌థ్యంలో సాగితే ఇక ఎఫ్3 మాత్రం పూర్తిగా మ‌నీ చుట్టూ తిరుగుతుంద‌న్నారు.

ఇందులో వెంకీ రేచీక‌టి ఉన్న పాత్ర‌లో చేస్తే వ‌రుణ్ తేజ్ న‌త్తి ఉన్న వ్య‌క్తి పాత్ర‌లో న‌టిస్తార‌ని తెలిపారు. ఎఫ్2లో ఉన్న వారంతా ఉన్నారు.

కాక పోతే సునీల్ , మ‌ణిశ‌ర్మ , ఆలీ కొత్త‌గా క‌నిపిస్తార‌న్నారు. ఎఫ్3 తర్వాత ఎఫ్4 కూడా వ‌చ్చినా ఆశ్చ‌ర్య పోవాల్సిన ప‌ని లేద‌న్నారు అనిల్ రావి పూడి.

Also Read : అఖండ మూవీకి లైన్ క్లియ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!