#TikTok : టిక్ టాక్ కు పాకిస్తాన్ ఓకే

అబ్బా చైనాతో బంధం దెబ్బ

Tik Tok  : చైనాతో ఉన్న రిలేష‌న్ షిప్ కంటిన్యూ చేయాల‌న్న ఉద్దేశంతో పాకిస్తాన్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే ప‌లు మార్లు త‌మ దేశంలో ప్ర‌ముఖ షార్ట్ వీడియో ప్లాట్ ఫామ్ గా పేరొందిన టిక్ టిక్ పై నిషేధం విధించింది.

ఇదిలా ఉండ‌గా ఈనెల 19న టిక్ టాక్ పై ఇప్ప‌టి దాకా విధించిన బ్యాన్ ను ఎత్తి వేసిన‌ట్టు పాకిస్తాన్ మీడియా రెగ్యులేటింగ్ అథారిటీ – పీఎంఆర్ఏ అధికారికంగా ప్ర‌క‌టించింది.

అయితే గ‌త 15 నెల‌ల్లో పాకిస్తాన్ ప్ర‌భుత్వం నాలుగు సార్లు టిక్ టాక్ (Tik Tok )పై నిషేధం విధించింది. గ‌త ఏడాది 2020 అక్టోబ‌ర్ న మొద‌టిసారి బ్యాన్ విధించింది.

ఈ టిక్ టాక్ యాప్ లో అస‌భ్య‌క‌ర‌మైన వీడియోలు వ‌స్తున్నాయ‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన స‌ర్కార్ నిషేధం విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

దీనిపై స్పందించింది టిక్ టాక్ (Tik Tok ) మాతృ సంస్థ బైట్ డ్యాన్స్ . పాకిస్తాన్ ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తామ‌ని, మీ రూల్స్ అండ్ రెగ్యులేష‌న్స్ కు త‌గ్గ‌ట్టు తాము న‌డుచుకుంటామ‌ని తెలిపింది.

అంతే కాకుండా ఎలాంటి బూతు లేదా అస‌భ్య వీడియోలు రాకుండా చూస్తామ‌ని హామీ ఇచ్చింది. దీంతో నాలుగోసారి పాకిస్తాన్ తాను బ్యాన్ ను ఎత్తి వేస్తున్న‌ట్లు వెల్ల‌డించింది.

విచిత్రం ఏమిటంటే పాకిస్తాన్ లో ఏ యాప్ కు లేనంత‌గా టిక్ టాక్ యాప్ న‌కు భారీ ఎత్తున డిమాండ్ ఉంది. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.

దాదాపు 39 మిలియ‌న్ యాప్ డౌన్ లోడ్స్ ఉండ‌డంతో మరోసారి పున‌రాలోచించింది పాకిస్తాన్. చైనాతో ఏ మాత్రం రిలేష‌న్ షిప్ కోల్పోయినా ప్ర‌మాదమ‌ని ముందే గ్ర‌హించింది. ఈ టిక్ టాక్ యాప్ చైనా దేశానికి చెందింది కావ‌డం గ‌మ‌నార్హం.

Also Read : జియోతో షావోమీ ఒప్పందం

Leave A Reply

Your Email Id will not be published!