#RakeshTikait : తండ్రి వార‌స‌త్వం తికాయ‌త్ పోరాటం

ఈ రైతు నాయ‌కుడు సామాన్యుడు

Rakesh Tikait  : ఇవాళ దేశం యావ‌త్తు ఒక‌డి వైపే చూస్తోంది. అనుకోకుండా కొంద‌రు నాయ‌కులుగా మారితే మ‌రికొంద‌రు మాత్రం పోరాట స్ఫూర్తిని అందిపుచ్చుకుని దిశా నిర్దేశం చేసే స్థాయికి చేరుకుంటారు.

త‌మ‌ను తాము ప్రూవ్ చేసుకుంటారు. త‌మ వైపు చూసేలా చేసుకుంటారు.

అలాంటి వారిలో ఇప్పుడు రాకేత్ తికాయ‌త్ (Rakesh Tikait )పేరు ఎక్కువ‌గా వినిపిస్తోంది. ఆయ‌న‌పై కూడా అంద‌రి లాగే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

రైతుల‌ను అడ్డం పెట్టుకుని రాజ‌కీయం చేస్తున్నాడ‌ని. కానీ ఇంత కాలం వారి వెంట ఉంటూ వ‌స్తున్నారు.

ఎక్క‌డా ఎవ‌రి ప‌క్షాన నిల‌బ‌డ‌లేదు. ఎవ‌రి పంచ‌న చేర‌లేదు.

చ‌లిలో రైతుల‌తో పాటే ఉన్నాడు. ఎండ‌లో వారితో పాటే న‌డిచాడు. భావ సారూప్య‌త క‌లిగిన వారంద‌రితోనూ మ‌మేకం అయ్యేలా చేశాడు. ఇది నాయ‌కుడికి ఉండాల్సిన ల‌క్ష‌ణం.

వ్య‌క్తుల కంటే వ్య‌వ‌స్థ‌ల కంటే ప్ర‌జ‌ల కంటే రాజ్యం బ‌లీయ‌మైన‌ది. అది ఈ రైతు నాయ‌కుడికి తెలుసు. కానీ రైతులంద‌రిని ఒకే తాటి పైకి తీసుకు రావాలంటే మామూలు విష‌యం కాదు.

ఎలాంటి వ‌న‌రులు లేకుండానే తాము పండించిన ధాన్యంతోనే తిరిగి వాళ్లు ఆందోళ‌న బాట ప‌ట్టారు.

రాకేశ్ తికాయ‌త్ గ‌తంలో పోలీస్ శాఖ‌లో ప‌ని చేశారు. అది న‌చ్చ‌క రాజీనామా చేశాడు.

త‌న తండ్రి వార‌స‌త్వాన్ని కొన‌సాగించాడు. ఇప్ప‌టికీ అదే స్ఫూర్తితో ముందుకు వెళుతున్నాడు.

ఇవాళ రాకేశ్ తికాయ‌త్ తెలియ‌ని వారంటూ ఉండ‌రు. మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ లీడ‌ర్ గా ఆయ‌న పేరొందారు.

కొత్త శ‌క్తితో, వ్య‌క్తిత్వంతో పెను మార్పుల‌తో ముందుకు సాగుతున్నారు తికాయ‌త్. ఆయ‌న సాధార‌ణ‌మైన వ్య‌క్తిగా ఉండేందుకు ప్ర‌య‌త్నం చేస్తూ వ‌చ్చారు.

ఆ మ‌ధ్య పోలీస్ బారికేడ్ల మ‌ధ్య రోడ్డు పైనే తిన‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

రైతుల దూతగా పిలుచుకున్న మ‌హేంద్ర సింగ్ తికాయ‌త్ వార‌స‌త్వాన్ని ఆయ‌న ఇద్ద‌రు కుమారులు న‌రేష్ తికాయ‌త్ , రాకేశ్ తికాయ‌త్(Rakesh Tikait )కొన‌సాగిస్తూ వ‌స్తున్నారు.

త‌న తండ్రి రైతుల‌కు ఎప్పుడూ ఒక‌టే చెప్పే వారు. త‌మ హ‌క్కుల కోసం పోరాడాల‌ని పిలుపునిచ్చారు. ప్ర‌భుత్వాలే త‌మ వ‌ద్ద‌కు వచ్చేలా చేయాల‌ని కోరారు.

తికాయ‌త్ ప్ర‌సంగం, భాష‌లో కాస్తా వ్యంగ్యం, ధిక్కారం ఉంటుంది. అది త‌న తండ్రి నుంచి వ‌చ్చిందే. ఏది ఏమైనా ఇప్పుడు ఇండియాలో రాకేశ్ హాట్ టాపిక్.

Also Read : ఆర్టీసీకి స‌జ్జ‌నార్ ‘చికిత్స’

Leave A Reply

Your Email Id will not be published!