#RichaChadha : ఆనాటి అభిమానం అలాగే ఉంది

రాహుల్ ద్ర‌విడ్ పై రిచా చ‌ద్దా కామెంట్

Richa Chadha : ప్ర‌పంచ క్రికెట్ లో రాహుల్ ద్ర‌విడ్ విస్మ‌రించ లేని ప‌దం. భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్ మ‌హ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్ సార‌ధ్యంలో త‌న కెరీర్ స్టార్ట్ చేశాడు ఈ క‌ర్నాట‌క కు చెందిన ప్లేయ‌ర్.

ఆ త‌ర్వాత ఆట‌గాడిగా, వికెట్ కీప‌ర్ గా, కెప్టెన్ గా, డైరెక్ట‌ర్ గా, హెడ్ కోచ్ గా ప‌రిణ‌తి చెందుతూ వ‌స్తున్నారు. ఆయ‌న‌కు మ‌రో పేరు కూడా ఉంది మిస్ట‌ర్ డిపెండ‌బుల్ గా వినుతికెక్కారు.

ఆయ‌న ఆట నుంచి దూర‌మైనా క్రికెట్ జ‌ట్టుకు దిశా నిర్దేశం చేసే స్థాయిగా ఎదిగారు. ఇండియ‌న్ క్రికెట్ అకాడెమీగా ఎంతో మంది యంగ్ ప్లేయ‌ర్ల‌ను త‌యారు చేశాడు. జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించేలా చేశాడు.

ఐపీఎల్ లో దుమ్ము రేపిన ఆట‌గాళ్ల‌లో ఎక్కువ మంది ఆయ‌న సార‌థ్యంలోనే, ద్ర‌విడ్ త‌ర్ఫీదులోనే మెరిక‌ల్లాగా త‌యార‌య్యారు. అయితే ఆనాటి నుంచి నేటి దాకా ద్ర‌విడ్ కు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.

తాజాగా ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి రిచా చ‌ద్దా సంచ‌ల‌న కామెంట్స్ చేసింది ది వాల్ పై. రాహుల్ కోచ్ గా రోహిత్ శ‌ర్మ సార‌థ్యంలో భార‌త్ తాజాగా టీ20 సీరీస్ నెగ్గింది.

ఇదే త‌రుణంలో రిచా చ‌ద్దా (Richa Chadha)చేసిన ఘాటు వ్యాఖ్య‌లు ఇప్పుడు వైర‌ల్ గా మారాయి. య‌వ్వ‌న స‌మ‌యంలో క్రికెట్ అంటే నాకు అభిమానం. అంత‌కంటే ఎక్కువ పిచ్చి కూడా.

నా బ్ర‌ద‌ర్ కూడా క్రికెట్ ఆడేవాడు. మ్యాచ్ ఉందంటే టీవీకే అతుక్కు పోయే దాన్ని. విచిత్రం ఏమిటంటే నాకు రాహుల్ ద్ర‌విడ్ అంటే చ‌చ్చేంత ఇష్టం. త‌ను రిటైర్ అయ్యాక చూడటం మానేశాన‌ని చెప్పింది.

అయితే ఇప్పుడు డ్రెస్సింగ్ రూంలో సంద‌డి చేస్తున్నాడని, ఇక నుంచి మ‌ళ్లీ చూస్తానంటోంది ఈ ముద్దుగుమ్మ‌.

Also Read : ‘కంగ‌నా’ ప‌ద్మ‌శ్రీ వెన‌క్కి తీసుకోండి

Leave A Reply

Your Email Id will not be published!