#PriyankaChopra : వారి ప్రేమ ‘ప‌దిలం’ పెళ్లి ‘శాశ్వ‌తం’

ఆ ప్ర‌చారం అంతా అబ‌ద్దం

Priyanka Chopra  : ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టిగా పేరొందిన ప్రియాంక చోప్రా మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. ఆమె త‌న పేరు ప‌క్క‌న నిక్ పేరు తొల‌గించారు. దీంతో సేమ్ చైతూ, సామ్ లాగే వీరు విడిపోతున్నారా అన్న అనుమానం వ్య‌క్త‌మైంది సామాజిక మాధ్య‌మాల్లో.

ఆమె అభిమానులు సైతం ప్రియాంక చోప్రా ఇది నిజ‌మేనా అంటూ ట్వీట్ల‌తో హోరెత్తిస్తున్నారు. దీంతో ప్రియాంక చోప్రా (Priyanka Chopra ) ట్రెండింగ్ లో ఉండి పోయింది.

ఆమె ఇటు బాలీవుడ్ తో పాటు అటు హాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉంటోంది. అంతే కాదు సోష‌ల్ మీడియాలో ప్రియాంక చోప్రాకు ల‌క్ష‌లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు.

దీంతో ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అప్ డేట్స్ తో పాటు ఫోటోలు కూడా షేర్ చేస్తూ వ‌స్తుంది. ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి త‌న వ్య‌క్తిగ‌త ఇన్ స్టా ఖాతా లో త‌న పేరు ప‌క్క‌నే ఉన్న నిక్ పేరు తొల‌గించ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది.

విచిత్రం ఏమిటంటే ప్రియాంక చోప్రా కంటే వ‌య‌సులో చిన్నోడు నిక్. ఆమె హిందూ అత‌ను క్రిష్టియ‌న్. వీరిద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ్డారు. పెళ్లి చేసుకున్నారు ఎవ‌రి సాంప్ర‌ద‌యంలో వాళ్లు. అంతే కాదు ప్రియాంక చోప్రా (Priyanka Chopra ) త‌న మ‌కాం హాలీవుడ్ కు మార్చేసింది.

అంతే కాదు బిజినెస్ లోకి ఎంట‌రైంది. ఓ రెస్టారెంట్ కూడా ఓపెన్ చేసింది. వీరిద్ద‌రి జంట చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటుంది కూడా. అయితే త‌న‌కంటే 12 ఏళ్లు చిన్న‌వాడు కావ‌డంతో అంతా విస్తు పోయారు.

పేరుతో పాటు ఓ క్యాప్ష‌న్ కూడా జ‌త చేసింది. ప్ర‌తి దానికి ఓ మొద‌లు అంటూ ఉంటుంద‌ని పేర్కొంది. ఈ విష‌యంపై ప్రియాంక చోప్రా త‌ల్లి స్పందించింది. వాళ్లిద్ద‌రు ప్రేమ‌లోనే ఉన్నారు.

వారి పెళ్లి శాశ్వ‌తం. ఆ బంధం ఎప్ప‌టికీ క‌లిసే ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది.

Also Read : పెళ్లి నాటి జ్ఞాప‌కం ప‌దిలం

Leave A Reply

Your Email Id will not be published!