#PunjabPolitics : పంజాబ్ లో ‘పాగా’ వేసేదెవ్వ‌రో

జెండాలు వేరైనా ఎజెండా ఒక్క‌టే

Punjab Politics : అంద‌రి చూపు పంజాబ్ వైపు ప‌డింది. రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మారుతున్నాయి. ప్ర‌ధాన పార్టీలు త‌మ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నాయి.

గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో ఆయా పార్టీలు క‌ద‌న‌రంగంలోకి ముందుగానే దూకాయి.

ప్ర‌జ‌ల‌ను త‌మ వైపు తిప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మ‌ల్లగుల్లాలు ప‌డుతోంది.

ద‌ళిత సామాజిక వ‌ర్గానికి చెందిన చ‌న్నీకి(Punjab Politics) సీఎంగా చాన్స్ ఇచ్చింది. ప్ర‌ధానంగా ఆ పార్టీకి ఇప్పుడు గ‌తంలో

సీఎంగా ప‌ని చేసి అర్ధంతరంగా రాజీనామా చేసి పార్టీని వీడిన మాజీ సీఎం కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ నుంచి గ‌ట్టి పోటీ ఎదురు కానుంది.

ఇక అంత‌ర్గ‌త క‌ల‌హాలు కూడా మ‌రో కార‌ణంగా క‌నిపిస్తోంది. అయితే చ‌న్నీ త‌న‌దైన శైలితో ముందుకు సాగుతున్నారు. కొంత డైన‌మిజం క‌లిగిన వ్య‌క్తి కావ‌డం,

గ‌తంలో మంత్రిగా ప‌ని చేసిన అనుభ‌వం ఉండ‌డంతో చాలా చాక‌చ‌క్యంగా నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు.

ప్ర‌ధానంగా ఇప్పుడు పంజాబ్ రైతులు ఎటు వైపు మొగ్గు చూపుతార‌నే దానిపై ఎక్కువ‌గా ఫోక‌స్ న‌డుస్తోంది.

ఆమ్ ఆద్మీ పార్టీ సైతం హామీల వ‌ర్షం కురిపిస్తోంది. ఈసారి ఎలాగైనా త‌న స‌త్తా చాటాల‌ని అనుకుంటోంది.

పంజాబీల ప్రార్థ‌నాల మందిరాల‌ను సైతం సంద‌ర్శిస్తున్నారు ఆ పార్టీ చీఫ్‌,

ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్. ఇప్ప‌టికే ప‌లుసార్లు రాష్ట్రంలో ప‌ర్య‌టించారు.

త‌మ‌ను అధికారంలోకి తీసుకు వ‌స్తే విద్య‌, వైద్యం, ఉపాధి, మ‌హిళా సాధికార‌త‌పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెడ‌తామంటున్నారు.

ఇక కెప్టెన్ తో క‌లిసి అధికారంలోకి రావాల‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ వ్యూహం ప‌న్నుతోంది.

అధికార పార్టీని ఎండ‌గ‌ట్టే ప‌నిలో నిమ‌గ్న‌మై ఉంది. ప్ర‌ధానంగా పార్టీ పంజాబ్ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ చీఫ్ న‌వ జ్యోత్ సింగ్ సిద్దూను (Punjab Politics)టార్గెట్ చేస్తోంది.

ఆయ‌న ఇమ్రాన్ ఖాన్ కు వ‌త్తాసు ప‌లుకుతున్నాడంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా విరుచుకు ప‌డుతోంది. ఇక రాష్ట్రంలో మెరుగైన ఓటు బ్యాంకు క‌లిగిన పార్టీగా శిరోమ‌ణి అకాళీద‌ళ్ పార్టీకి ఉంది.

ఈ పార్టీ గ‌తంలో ఎన్డీఏ స‌ర్కార్ లో భాగ‌స్వామిగా ఉంది. కానీ రైతు చ‌ట్టాల‌ను తీసుకు రావడాన్ని నిర‌సిస్తూ కేబినెట్ నుంచి వైదొలిగింది. రైతుల పోరాటానికి మ‌ద్ద‌తు తెలిపింది.

దీంతో ఆ పార్టీ బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీతో క‌లిసి పోటీ చేస్తోంది. మొత్తం మీద కాంగ్రెస్, బీజేపీ, కెప్టెన్ పార్టీ, ఎస్ఏడీ, బీఎస్పీ, ఆప్ ల మ‌ధ్య నువ్వా నేనా అన్న రీతిలో త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

హ‌స్తం నిలుస్తుందా లేదా అన్న‌ది త్వ‌ర‌లో తేల్చ‌నున్నారు పంజాబ్ ప్ర‌జ‌లు.

Also Read : పంజాబ్ కోట‌లో ‘కెప్టెన్’ పాగా వేసేనా

Leave A Reply

Your Email Id will not be published!