#AditiSingh : ఆదితి సింగ్ కాంగ్రెస్ కు గుడ్ బై

కాషాయ తీర్థం పుచ్చుకోనున్న ఎమ్మెల్యే

Aditi Singh : త్వ‌ర‌లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే ల‌క్నో కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ ఫోక‌స్ పెట్టారు.

ఆమె అక్క‌డే మ‌కాం ఉంటూ ప్ర‌చారాన్ని ఉధృతం చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా యూపీలోని రాయ్ బ‌రేలీలో కంచు కోట‌గా ఉంటూ వ‌స్తోంది కాంగ్రెస పార్టీకి.

తాజాగా ఆ నియోజ‌క‌వ‌ర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఆ పార్టీ రెబ‌ల్ శాస‌న స‌భ్యురాలు ఆదితి సింగ్ ఇవాళ గుడ్ బై చెప్పేశారు. గ‌త కొంత కాలంగా ఆమె కాంగ్రెస్ పార్టీ నిర్ణ‌యాల‌ను, అధినాయ‌క‌త్వాన్ని ప్ర‌శ్నిస్తూ, నిల‌దీస్తూ వ‌స్తున్నారు.

ఆమెకు ఇప్పుడు 34 ఏళ్లు. ప్ర‌ధానంగా ప్రియాంక గాంధీని టార్గెట్ చేశారు. ఆమె ఏది మాట్లాడినా అది త‌ప్పేనంటూ పేర్కొన్నారు. అంతే కాకుండా కేంద్రంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ తీసుకుంటున్న నిర్ణ‌యాలు క‌రెక్ట్ అంటూ బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌లు చేశారు.

ఓ వైపు రైతులు సాగు చ‌ట్టాల‌ను రద్దు చేయాల‌ని ఆందోళ‌న చేప‌ట్ట‌గా వారికి బేష‌ర‌తుగా కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తు ఇచ్చింది. దీనిపై తీవ్ర అభ్యంత‌రం తెలిపింది ఆదితి సింగ్(Aditi Singh). సాగు చ‌ట్టాలు దేశానికి మంచి వంటూ కితాబు ఇచ్చింది.

అయితే యూపీలోని ల‌ఖీంపూర్ ఖేరీ ఘ‌ట‌న‌పై స్పందించ లేదు. ఆ ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించింది. ఇదిలా ఉండ‌గా ఆమె తండ్రి దివంగ‌త అఖిలేష్ సింగ్ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఇక ఆదితి సింగ్ తొలిసారిగా 2017లో యూపీ అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. మొత్తంగా మంచి ప‌ట్టు క‌లిగిన స్థానం కోల్పోవ‌డం ఒక ర‌కంగా పార్టీకి దెబ్బేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Also Read : స్టాలిన్ పాల‌న‌కు ‘200 రోజులు జేజేలు’

Leave A Reply

Your Email Id will not be published!