#ArunDhumal : ‘మెనూ వివాదం’పై బీసీసీఐ క్లారిటీ

ఎలాంటి ఆదేశాలు జారీ చేయ‌లేదు

Arun Dhumal : భార‌త‌, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య మొద‌టి టెస్టు మ్యాచ్ కాన్పూర్ వేదిక‌గా ఈనెల 25న జ‌ర‌గ‌నుంది. ఇదిలా ఉండ‌గా భార‌త క్రికెట్ జ‌ట్టుకు ఏర్పాటు చేసే మెనూ ( ఆహారం )లో మార్పులు చేశారంటూ దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగింది.

దీంతో దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టింది భార‌తీయ క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి – బీసీసీఐ. ఈ మేర‌కు ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది బీసీసీఐ.

తాము ఇప్ప‌టి దాకా టీమిండియాకు ఎలాంటి ఆహారం తినాలో తిన‌కూడ‌దో అనే దానిపై ఆంక్ష‌లు విధించ లేద‌ని తెలిపింది. ఈ మేర‌కు బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధ‌మాల్(Arun Dhumal) అధికారికంగా క్లారిటీ ఇచ్చారు.

ఇప్ప‌టి దాకా తాము బీసీసీఐ ప‌రంగా ఎలాంటి ఆదేశాలు జారీ చేయ‌లేద‌న్నారు. కొత్త డైట్ రూల్ ను తాము పాస్ చేయ‌లేద‌న్నారు.

సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ కావ‌డంతో పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్త‌మైంది బీసీసీఐపై. ఆట‌గాళ్ల తిండిపై కూడా మీ పెత్త‌నం ఏంటి అంటూ నిప్పులు చెరుగుతున్నారు.

ఈ మేర‌కు నెటిజన్లు, క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ రోజు వ‌ర‌కు భార‌తీయ క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకోలేదు. అలాంటి ఆలోచ‌న చేయ‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

భార‌తీయ క్రికెట‌ర్ల‌కు బీసీసీఐ స్వేచ్ఛ ఇచ్చామ‌ని తెలిపారు. వారు త‌మ ఇష్టం వ‌చ్చిన ఫుడ్ తిన‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు. ఆట‌గాళ్ల‌కు కానీ జ‌ట్టు స‌హాయ‌క సిబ్బందికి తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయ‌లేద‌ని వెల్ల‌డించారు.

తాము డైట్ ప్లాన్ ను రూపొందించ లేద‌ని పేర్కొన్నారు.

Also Read : రికార్డుల‌ కంటే దేశానికి ఆడ‌టం ముఖ్యం

Leave A Reply

Your Email Id will not be published!