#ModiFreeRation : మార్చి దాకా ఉచిత రేష‌న్

తీపి క‌బురు చెప్పిన కేంద్రం

Modi Free Ration  : దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ ఆధ్వ‌ర్యంలో ఇవాళ కేంద్ర మంత్రి వ‌ర్గం కీల‌క స‌మావేశం నిర్వ‌హించింది. ఈ మేర‌కు ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ప్ర‌ధానంగా ప్ర‌ధాని ప్ర‌క‌టించిన విధంగానే తాము తీసుకు వ‌చ్చిన సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తూ పార్ల‌మెంట్ లో బిల్లు ప్ర‌వేశ పెట్టాల‌ని తీర్మానం చేసింది. ఈ మేర‌కు ఏక‌గ్రీవంగా ఆమోదించింది మంత్రివ‌ర్గం.

ఇంకో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కోట్లాది నిరుపేదల‌కు మేలు చేకూర్చేలా గ‌తంలో ఉచితంగా రేష‌న్ ప‌థ‌కాన్ని తీసుకు వ‌చ్చింది మోదీ స‌ర్కార్. క‌రోనా క‌ష్ట కాలంలో ఈ ప‌థ‌కం మ‌రింత ల‌బ్ది చేకూర్చేలా చేసింది.

కోట్లాది అన్నార్థుల‌కు అన్నం పెట్టేలా చేసింది. దీనిపై సుదీర్ఘంగా చ‌ర్చించిన అనంత‌రం మోదీ ఉచితంగా రేష‌న్(Modi Free Ration )కార్య‌క్ర‌మాన్ని వ‌చ్చే ఏడాది అంటే 2022 మార్చి నెలాఖ‌రు దాకా అమ‌లు చేయాల‌ని ఆదేశించారు.

ఈ మేర‌కు కేంద్ర మంత్రి వ‌ర్గం దీనికి కూడా బేష‌ర‌తుగా ఎలాంటి చ‌ర్చ లేకుండానే ఆమోదించింది. ఈ విష‌యాన్ని అధికారికంగా వెల్ల‌డించారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణ‌యాల‌ను వెల్ల‌డించారు. ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చారు. ప్ర‌ధానంగా బిట్ కాయిన్ విష‌యంలో కేంద్రం ఎలాంటి నిర్ణ‌యం తీసుకో బోతోంద‌న్న ఉత్కంఠ ఇంకా కొన‌సాగుతూనే ఉన్న‌ది.

దీంతో బిట్ కాయిన్ కు సంబంధించి స్టాక్ మార్కెట్ లో పెద్ద దెబ్బ ప‌డింది. పీఎంజీకేఏవై స్కీమ్ ను ఇంప్లిమెంట్ చేస్తున్న‌ట్లు తెలిపింది. విప‌క్షాల‌తో పాటు స్వ‌చ్చంధ సంస్థ‌లు సైతం ఉచిత రేష‌న్ ఇవ్వాల‌ని కోరడంతో కేంద్రం దిగి వ‌చ్చింది.

Also Read : గౌతమ్ గంభీర్ కు బెదిరింపు

Leave A Reply

Your Email Id will not be published!

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!