#ICCRankings : ఐసీసీ ర్యాంకింగ్స్ లో బాబ‌ర్, హ‌స‌రంగ టాప్

టాప్ 5లో కేఎల్ రాహుల్ ..కోహ్లీ ఔట్

ICC Rankings : ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ – ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ (ICC Rankings)రిలీజ్ చేసింది. బ్యాటింగ్ విభాగంలో భార‌త జ‌ట్టు ఓపెన‌ర్ కేఎల్ రాహుల్ కు టాప్ 5 లో చోటు ద‌క్కింది. మాజీ భార‌త జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ టాప్ 10లో చోటు ద‌క్క లేదు.

కీవీస్ తో జ‌రిగిన టీ20 సీరీస్ లో భార‌త్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ సీరీస్ లో రోహిత్ శ‌ర్మ‌, రాహుల్ రాణించారు. తొలి రెండు మ్యాచ్ ల‌లో బాగా ఆడ‌డంతో త‌న ర్యాంకును మెరుగు ప‌ర్చుకున్నాడు.

729 పాయింట్ల‌తో ఐదో ప్లేస్ లో నిలిచాడు. రోహిత్ శ‌ర్మ 13వ ప్లేస్ లో ఉన్నాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్ 809 పాయింట్ల‌లో మ‌రోసారి టాప్ లో నిలిచాడు.

805 పాయింట్లో ఇంగ్లండ్ బ్యాట‌ర్ మ‌లాన్ , సౌతాఫ్రికా ప్లేయ‌ర్ మార్క్ర‌మ్ 796 పాయింట్లో థ‌ర్డ్ స్థానంతో స‌రి పెట్టుకున్నాడు. ఇక పాకిస్తాన్ కు చెందిన మ‌రో ఆట‌గాడు, ఓపెన‌ర్ రిజ్వాన్ 735 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో ఉన్నాడు.

కీవీస్ స్టార్ ప్లేయ‌ర్ గ‌ప్టిల్ టాప్ టెన్ లో చోటు ద‌క్కింది. 658 పాయింట్లతో ప‌దో ప్లేస్ లో నిలిచాడు. ఇక బౌలింగ్ లో శ్రీ‌లంక స్టార్ బౌల‌ర్ వ‌నిందు హ‌స‌రంగ 797 పాయింట్ల‌తో ఫ‌స్ట్ ప్లేస్ ద‌క్కించుకున్నాడు.

సౌతాఫ్రికా కు చెందిన షంసీ 784 పాయింట్లు సాధించి రెండో ప్లేస్ లో, ఆసిస్ కు చెందిన ఆడ‌మ్ జంపా 725 పాయింట్ల‌తో మూడో ప్లేస్ లో నిలిచాడు. ఇక భార‌త్ కు సంబంధించి ఏ ఒక్క బౌల‌ర్ లేక పోవ‌డం గ‌మ‌నార్హం.

ఆల్ రౌండ‌ర్ విభాగంలో న‌బీ తొలి ప్లేస్ లో ఉండ‌గా హ‌స‌న్ రెండో స్థానంలో, లివింగ్ స్టోన్ మూడో ప్లేస్ లో కొన‌సాగుతున్నాడు.

Also Read : చెమ‌టోడ్చుతున్న భార‌త క్రికెట‌ర్లు

Leave A Reply

Your Email Id will not be published!