#KavithaMlc : ఎమ్మెల్సీగా ‘క‌ల్వ‌కుంట్ల క‌విత’ ఏక‌గ్రీవం

శ్రీ‌నివాస్ నామినేష‌న్ తిరస్క‌ర‌ణ

Kavitha Mlc  : ఎలాంటి ఉత్కంఠ లేకుండానే నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థ‌ల శాస‌న‌మండ‌లి స‌భ్యురాలు ( ఎమ్మెల్సీ)గా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి త‌న‌య క‌ల్వ‌కుంట్ల క‌విత(Kavitha Mlc )ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు.

స్వ‌తంత్ర అభ్య‌ర్థి శ్రీ‌నివాస్ నామినేష‌న్ ను తిర‌స్క‌రించ‌డంతో ఆమె ఎన్నిక లాంఛ‌నంగా ముగిసింది. ఇదిలా ఉండ‌గా నిజామాబాద్ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఇద్ద‌రు మాత్ర‌మే పోటీలో నిలిచారు చివ‌ర‌గా.

తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ త‌ర‌పున సిట్టింగ్ ఎమ్మెల్సీ క‌విత‌, తెలంగాణ పంచాయ‌తీరాజ్ చాంబ‌ర్ త‌ర‌పున ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గం మాక్లూర్ మండ‌లం అమ్రాద్ గ్రామానికి చెందిన కోట‌గిరి శ్రీ‌నివాస్ ఇండిపెండెంట్ గా నామినేష‌న్ దాఖ‌లు చేశారు.

అయితే ప్ర‌ధాన పార్టీలైన భార‌తీయ జ‌న‌తా పార్టీ, కాంగ్రెస్ పార్టీ పోటీకి దూరంగా ఉన్నాయి. కాగా స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేసిన అభ్య‌ర్థిపై ఫోర్జ‌రీ ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఎన్నిక‌ల అధికారి అత‌డి ఎన్నిక చెల్ల‌దంటూ నిర్ణ‌యం తీసుకున్నారు.

చివ‌రి వ‌ర‌కు ఈసారి ఎమ్మెల్సీగా క‌ల్వ‌కుంట్ల క‌విత(Kavitha Mlc )పోటీ చేయ‌ర‌ని, ఆమెకు రాజ్య‌స‌భ సీటు ఇస్తార‌ని ప్ర‌చారం జోరుగా సాగింది. ఇటీవ‌ల రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న బండ ప్ర‌కాశ్ త‌న ప‌ద‌వికి స్వ‌చ్చంధంగా రాజీనామా చేశారు.

ఆయ‌న‌ను అనూహ్యంగా ఆఖ‌రు నిమిషంలో టీఆర్ఎస్ పార్టీ చీఫ్‌, సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేల కోటా కింద సీటు కేటాయించారు.

దీంతో ఈట‌ల రాజేంద‌ర్ సామాజిక వ‌ర్గానికి చెందిన వాడు కావ‌డంతో మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌వ‌చ్చ‌ని అందుకే ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి క‌ట్ట బెట్టార‌ని ప్ర‌చారం జ‌రిగింది.

క‌విత తాను తిరిగి ఎమ్మెల్సీగా రావ‌డంతో అంతా అవాక్క‌య్యారు.

Also Read : ముగిసిన ఎమ్మెల్సీ నామినేష‌న్ల ప‌ర్వం

Leave A Reply

Your Email Id will not be published!