#PerniNani : అందుబాటులో సినిమా టికెట్ల ధ‌ర‌లు

ప్ర‌క‌టించిన మంత్రి పేర్ని నాని

Perni Nani : సినిమా రంగానికి సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ఏపీ మంత్రి పేర్ని నాని. ఈ ప‌రిశ్ర‌మ‌లో కొంద‌రు మాత్ర‌మే ఆధిప‌త్యం చెలాయిస్తున్నార‌ని అలాంటి వారికి అడ్డుకట్ట వేసేందుకే తాము ఆన్ లైన్ లో టికెట్ల విక్ర‌యం తీసుకు రావాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు.

పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వాళ్ల బ‌ల‌హీన‌త‌లు సొమ్ము చేసుకుంటున్నార‌ని ఆరోపించారు. అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా ఇవాళ సినిమా చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లుపై చ‌ర్చ జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా మంత్రి పేర్ని నాని(Perni Nani)  ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సినిమా షోల‌ను ఇష్టానుసారంగా వేస్తున్నార‌ని, చ‌ట్టంలోని రూల్స్ పాటించ‌డ లేద‌ని మండిప‌డ్డారు నాని.

కొంద‌రు త‌మ‌కు ఇష్టం వ‌చ్చిన‌ట్లు ధ‌ర‌లు పెంచుకుంటూ రిలీజ్ చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆన్ లైన్ ప‌ద్ద‌తికి శ్రీ‌కారం చుట్టామ‌న్నారు.

ఎవ‌రు ప‌డితే వాళ్లు సినిమా ఆట‌లు కూడా పెంచుకుంటున్నార‌ని, దీనిపై పూర్తిగా నియంత్ర‌ణ కొర‌వ‌డింద‌న్నారు. అందుకే సినిమా షోల‌ను కూడా అదుపు చేయాల‌ని అనుకుంటున్న‌ట్లు చెప్పారు పేర్ని నాని(Perni Nani).

సినిమా ప‌రిశ్ర‌మ ప్ర‌భుత్వ నియ‌మ నిబంధ‌న‌ల‌కు క‌ట్టుబ‌డి ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. కాదంటే కుద‌ర‌ద‌ని హెచ్చ‌రించారు. అస‌లు సినిమాల‌కు సంబంధించిన క‌లెక్ష‌న్లు, క‌డుతున్న ప‌న్నుల‌కు ఎలాంటి లింకు లేకుండా పోయింద‌న్నారు.

ప్ర‌భుత్వ పోర్ట‌ల్ ద్వారా పార‌ద‌ర్శ‌కంగా, ప్ర‌జ‌లంద‌రికీ అందుబాటులో ఉండే ధ‌ర‌కు టికెట్ల‌ను తీసుకొస్తామ‌ని చెప్పారు. త‌మ విధానాన్ని డిస్ట్రిబ్యూట‌ర్లు, నిర్మాత‌లు, ఎగ్జిబిట‌ర్లు స్వాగ‌తించార‌ని తెలిపారు.

సినిమాటోగ్ర‌ఫీ చ‌ట్టంలో మార్పులు చేశామ‌ని వెల్ల‌డించారు మంత్రి. అయితే థియేట‌ర్ల‌తో పాటు ఆన్ లైన్ లో టికెట్లు అందుబాటులో ఉంటాయ‌ని ప్ర‌క‌టించారు.

Also Read : బాధితుల‌కు ‘రూ. 25 ల‌క్ష‌లు’ ఇవ్వాలి

Leave A Reply

Your Email Id will not be published!

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!