#PadhaaranalaTeluguBala : ‘ప‌దార‌ణాల తెలుగు బాల’ కెవ్వు కేక

తెలుగుదనానికి ప్ర‌తీక‌గా నిలిచిన గేయం

Padhaaranala Telugu Bala : తెలుగుద‌నం వాడి పోని క‌మ్మ‌ద‌నం. తెలుగు వారు ఎక్క‌డున్నా స‌రే సంస్కృతి, సంప్రదాయాల‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇవ్వ‌డం ప‌రిపాటి. ఆధునిక‌త చోటు చేసుకున్నా దేశాలు దాటి వెళ్లినా త‌మ కట్టు, బొట్టు, భాష‌, యాస‌ను మరిచి పోవ‌డం లేదు.

టెక్నాల‌జీ డామినేట్ చేస్తున్నా తెలుగు వెలుగుతోంది. దేశంలోనే అత్య‌ధికంగా మాట్లాడే భాషల్లో మ‌న తెలుగు నాలుగో స్థానంలో ఉంది.

సినిమాల్లోనే కాకుండా ప్ర‌స్తుతం యూట్యూబ్ పుణ్య‌మా అని తెలుగు భాష‌ను ప‌రిరక్షించేలా, తెలుగు ద‌నం ప్రాశ‌స్త్యాన్ని పెంపొందించేలా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతూ వ‌స్తున్నాయి.

ఈ త‌రుణంలో తాజాగా ప‌ద‌హార‌ణాల తెలుగు బాల (Padhaaranala Telugu Bala) పేరుతో రిలీజ్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. దీనిని క్రిష్ ఆధ్వ‌ర్యంలో రూపొందించారు. స‌హ‌జ‌త్వానికి ద‌గ్గ‌ర‌గా ఉండేలా తీర్చి దిద్దారు.

గుత్తా వాస‌వి, చ‌ల‌ప‌తి రావు దీనిని నిర్మించారు. ఈ గేయాన్ని రాయ‌ట‌మే కాదు పాడి, సంగీతాన్ని అందించారు చ‌ర‌ణ్ అర్జున్ తో పాటు శ్రీ విద్య పాడారు. ఆమె వాయిస్ క‌ట్టి ప‌డేసేలా ఉంది.

ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌స్తుతం ఈ సాంగ్ ను వింటూ పుల‌కించి పోతున్నారు. ప‌ద‌హార‌ణాల తెలుగు బాల సాంగ్ లో న‌టించి మెప్పించింది నాగ దుర్గ‌. ఇప్ప‌టికే బ‌తుక‌మ్మ‌,

త‌దిత‌ర పాట‌ల్లో న‌టించి ఆక‌ట్టుకుంది. అచ్చం తెలుగు వారి అమ్మాయి లాగా అద్భుతంగా ఒదిగి పోయింది. ప్ర‌త్యేకించి న‌ల్ల‌గొండ జిల్లాలోని పాన్ గ‌ల్ లో ప్ర‌ముఖ దేవాల‌యంగా పేరొందిన ఛాయ సోమేశ్వ‌ర ఆల‌యంతో పాటు విద్యా భార‌తి స్కూల్ లో చిత్రీక‌రించారు.

ఎడిటింగ్ కూడా బాగుంది. మొత్తంగా ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ‌కు ఈ సాంగ్ అద్దం ప‌డుతుంది. యూట్యూబ్ లో ఉంది వీలైతే చూడండి.

Also Read : హాస్యం లేకుంటే లైఫ్ బోర్

Leave A Reply

Your Email Id will not be published!