#ChateswarPujara : రికార్డుల‌ కంటే దేశానికి ఆడ‌టం ముఖ్యం

చ‌తేశ్వ‌ర్ పుజారా సంచ‌ల‌న కామెంట్స్

Chateswar Pujara : భార‌త క్రికెట‌ర్, టెస్ట్ స్పెష‌లిస్ట్ ప్లేయ‌ర్ గా పేరొందిన చ‌తేశ్వ‌ర్ పుజారా(Chateswar Pujara )ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఈనెల 25న కాన్పూర్ లో స్వ‌దేశంలో న్యూజిలాండ్ తో ఫ‌స్ట్ టెస్టు మ్యాచ్ ఆడ‌నుంది.

భార‌తీయ క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి – బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ పుజారాకు వైఎస్ కెప్టెన్ గా ప్ర‌మోష‌న్ ఇచ్చింది. ప్ర‌త్యేకించి జ‌ట్టులో ఎక్కువ సేపు ఉంటూ వికెట్లు పోకుండా కాపాడ‌టంలో పుజారా ఫోక‌స్ పెడుతూ వ‌స్తున్నాడు.

అయితే ఈ మ‌ధ్య ఆట‌లో కొంచెంత స్లోగా కాకుండా దూకుడు పెంచాడు. దీనిపై క్లారిటీ ఇచ్చాడు చ‌తేశ్వ‌ర్ పుజారా. ఇప్ప‌టికే మైదానంలో ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్నాడు.

వ్య‌క్తిగ‌త స్కోర్ కంటే దేశం కోసం ఆడ‌ట‌మే త‌న‌కు ముఖ్య‌మ‌న్నాడు. మ‌న దేశం కోసం ఆడుతున్నామ‌న్న భావ‌న ఎంతో గొప్ప‌గా ఉంటుంద‌న్నాడు. గ‌త మూడేళ్లుగా ఒక్క సెంచ‌రీ చేయ‌క పోవ‌డం అన్న‌ది స‌మ‌స్య కానే కాద‌న్నాడు.

జ‌ట్టు గెలుపొందే స‌మ‌యంలో తాను చేసిన 80 లేదా 90 ప‌రుగులు అత్యంత కీల‌కంగా మారుతున్న‌ప్పుడు దాని గురించి ఆలోచించ‌న‌ని చెప్పాడు చ‌తేశ్వ‌ర్ పుజారా. నా ఆట తీరు మార్చుకోవాలంటూ ఎన్నో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

నా టెక్నిక్ మార లేదు. కానీ కొంచెం స్పీడ్ పెంచిన మాట వాస్త‌వ‌మేన‌ని పేర్కొన్నాడు. తాను ధాటిగా ఆడేందుకు ఇంగ్లండ్ టూర్ తోడ్ప‌డింద‌ని తెలిపాడు.

ద్ర‌విడ్ రాక‌తో ఆట‌గాళ్ల‌లో మ‌రింత ఆత్మ విశ్వాసం పెరిగింద‌న్నాడు. మ‌రో వైపు ఫ‌స్ట్ టెస్ట్ కీవీస్ తో ఉండ‌డంతో గ్రౌండ్ లో ఫుల్ ప్రాక్టీస్ లో మునిగి పోయారు భార‌త ఆట‌గాళ్లు.

Also Read : ద్ర‌విడ్ కు స‌ల్మాన్ భ‌ట్ కితాబు

Leave A Reply

Your Email Id will not be published!