#RahulDravid : ద్ర‌విడ్ లో అదే జోరు అదే జోష్

ప్రాక్టీస్ సెష‌న్ లో ఫుల్ బిజీ

Rahul Dravid : భార‌త, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య ఈనెల 25న కాన్పూర్ వేదిక‌గా మొద‌టి టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే భార‌త జ‌ట్టు ఆట‌గాళ్లు స్టేడియంలో ముమ్మ‌రంగా ప్రాక్టీసులో మునిగి పోయారు.

కొత్త కోచ్ గా రాహుల్ ద్ర‌విడ్ , కొత్త కెప్టెన్ అజింక్యా ర‌హానే సార‌థ్యంలో ఆట‌గాళ్లు చెమ‌టోడ్చుతున్నారు.

హెడ్ కోచ్ గా ఉన్న ర‌వి శాస్త్రి త‌ప్పు కోవ‌డంతో బీసీసీఐ ఏరికోరి ద్ర‌విడ్ కు బాధ్య‌త‌లు అప్ప‌గించింది.

బ్యాటింగ్ కోచ్ గా ఎప్ప‌టి లాగే విక్ర‌మ్ రాథోడ్ ఉండ‌గా , ఫీల్డింగ్ కోచ్ గా హైద‌రాబాద్ కు చెందిన టీకే దిలీప్ , బౌలింగ్ కోచ్ గా మాంబ్రేలు భార‌త ఆట‌గాళ్ల‌ను రాటు దాల్చే ప‌నిలో ఉన్నారు.

ఇప్ప‌టికే రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీ లో టీ20 సీరీస్ ను చేజిక్కించుకుంది టీమిండియా. జోరు మీదుకున్న భార‌త్ ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ కు రెడీ అవుతోంది.

టెస్టు సీరీస్ లో భాగంగా రెండు టెస్టులు ఆడ‌నుంది న్యూజిలాండ్.

గాయం కార‌ణంగా త‌ప్పుకున్న కెప్టెన్ క‌న్ విలియ‌మ్స‌న్ తిరిగి రానుండ‌డంతో ఇరు జ‌ట్ల మ‌ధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ జ‌ర‌గ‌నుంది.

ఇక రాహుల్ ద్ర‌విడ్ కు ఇది అగ్ని ప‌రీక్ష కానుంది. ఇప్ప‌టికే టీసీరీస్ నెగ్గాక కీల‌క కామెంట్స్ చేశాడు రాహుల్ ద్ర‌విడ్(Rahul Dravid). విజ‌య గ‌ర్వంతో మిడిసి ప‌డ‌వ‌ద్దంటూ సూచించాడు.

ఏ మాత్రం అజాగ్ర‌త్త‌గా ఉంటే భారీ మూల్యం చెల్లించు కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించాడు .

ఇదే స‌మ‌యంలో త‌న‌కు అచ్చొచ్చిన మైదానం కూడా కావ‌డంతో ద్ర‌విడ్ ఫుల్ ఫోక‌స్ పెట్టాడు.

ఓ వైపు బ్యాటింగ్ మెళ‌కువ‌లు చెబుతూనే మ‌రో వైపు బౌలింగ్ తానే చేస్తూ ఆట‌గాళ్ల‌కు ట్రైనింగ్ ఇస్తున్నాడు.

ద్ర‌విడ్(Rahul Dravid) ను చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు చేరుకున్నారు.

ద్ర‌విడ్ ద్ర‌విడ్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు సైతం రాహుల్ తో సెల్ఫీలు దిగేందుకు పోటీ ప‌డ్డారు.

Also Read : మాస్ట‌ర్ సాంగ్’ తో క్రికెట‌ర్ల డ్యాన్స్

Leave A Reply

Your Email Id will not be published!