#KodaliNani : నానితో పాటు ఎమ్మెల్యేల‌కు భ‌ద్ర‌త పెంపు

టీడీపీ శ్రేణుల నుంచి బెదిరింపుల నేప‌థ్యం

Kodali Nani : ఏపీలో రాజ‌కీయాలు వేడెక్కాయి. నువ్వా నేనా అన్న రీతిలో మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ఇప్ప‌టికే టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు భార్య‌పై కామెంట్స్ చేశార‌న్న దానిపై మంత్రి కొడాలి నానితో (Kodali Nani) పాటు ప‌లువురు ఎమ్మెల్యేల‌ను టీడీపీ శ్రేణులు టార్గెట్ చేశాయి.

వీరి కామెంట్స్ ను నిర‌సిస్తూ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు మిన్నంటాయి.

ఎవ‌రైతే బాబుపై వ్యాఖ్య‌లు చేశారో వారిని టార్గెట్ చేస్తూ సామాజిక మాధ్య‌మాల్లో బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారు.

దీంతో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముంద‌స్తు ఆదేశాల‌తో ప్ర‌భుత్వం ఏపీ పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి కొడాలి నానితో(Kodali Nani) పాటు ఎమ్మెల్యేలు

వ‌ల్ల‌భ‌నేని వంశీ, అంబ‌టి రాం బాబు, ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డిల‌కు భ‌ద్ర‌త పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

ప్ర‌స్తుతం మంత్రి నానికి ఉన్న ప్ర‌స్తుత గ‌న్ మెన్ల‌ను అద‌నంగా ఐదుగురికి పెంచింది.

అంతే కాకుండా కాన్వాయ్ లో అద‌నంగా మ‌రో సెక్యూరిటీ వాహ‌నాన్ని ఏర్పాటు చేసింది.

ఇంకో వైపు వంశీ, రాంబాబు, ద్వారంపూడిల‌కు అద‌నంగా 3+3 గ‌న్ మెన్ సెక్యూరిటీని క‌ల్పించింది ప్ర‌భుత్వం

. సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన బెదిరింపులు, ఫిర్యాదుల‌పై సెక్యూరిటీ రివ్యూ క‌మిటీ స‌మీక్షించింది.

అనంత‌రం వెంట‌నే భ‌ద్ర‌త పెంచాల‌ని నిర్ణ‌యం తీసుకుంది స‌ర్కార్. మొన్న జ‌రిగిన అసెంబ్లీలో టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు తాను ఇక నుంచి కౌర‌స‌భ‌లో అడుగు పెట్ట‌బోనంటూ ప్ర‌క‌టించి బాయ్ కాట్ చేశారు.

అనంత‌రం విజ‌య‌వాడ‌లో జ‌రిగిన ప్రెస్ మీట్ లో సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌న భార్య భువ‌నేశ్వ‌రి దేవి క్యారెక్ట‌ర్ ను కించ ప‌రిచేలా మాట్లాడారంటూ బోరుమన్నారు.

క‌న్నీటి ప‌ర్యంత‌మై మంత్రులు, ఎమ్మెల్యేల‌పై నిప్పులు చెరిగారు. ఆ త‌ర్వాత ఆయ‌న బావ మ‌రిది, ఎమ్మెల్యే, న‌టుడు బాల‌కృష్ణ త‌న వారితో క‌లిసి ఇంకో సారి నోరు జారితే జాగ్ర‌త్త అంటూ వార్నింగ్ ఇచ్చారు.

Also Read : నేటి స‌మాజానికి నిస్వార్థ సేవ అవ‌స‌రం

Leave A Reply

Your Email Id will not be published!

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!