#SubramaniyanSwamy : ‘క‌త్తుల క‌ర‌చాల‌నం’ సంచ‌ల‌నం

మమ‌తా బెన‌ర్జీతో సుబ్ర‌మ‌ణియ‌న్ స్వామి భేటీ

Subramaniyan Swamy : రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌రు. శాశ్వ‌త మిత్రులు ఉండ‌రు. రెండు భిన్న ధృవాలు. ఒక‌రు ఫైర్ బ్రాండ్ గా పేరొందిన ముఖ్య‌మంత్రి. బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ.

మ‌రొక‌రు దేశ రాజ‌కీయాల‌లో త‌న‌దైన ముద్ర వేసుకున్న నాయ‌కుడు సుబ్ర‌మ‌ణియ‌న్ స్వామి. ఈ ఇద్ద‌రు త‌ల‌పండిన మేధావులే కాదు ఆరి తేరిన రాజ‌కీయ యోధులు. వారి వ్యూహాలు వారికి ఉన్నాయి.

వారి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. కానీ వీరిద్ద‌రూ నిన్న‌టి దాకా క‌త్తులు దూసుకున్నారు. మాట‌ల‌తో మంట‌లు రేపారు. ప‌ర‌స్ప‌ర ఆరోప‌ణ‌లు సైతం చేసుకున్నారు.

కానీ ఇవాళ అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. నాలుగు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం మ‌మ‌తా బెన‌ర్జీ ఢిల్లీకి వ‌చ్చారు. ప‌నిలో ప‌నిగా ఆమె మొద‌ట ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో స‌మావేశం అయ్యారు.

ప్ర‌ధాన అంశాల‌పై చ‌ర్చించారు. ప్ర‌ధానంగా రాష్ట్రంలో బీఎస్ఎఫ్ ప‌రిధిలో విస్త‌రించ‌డాన్ని విర‌మించు కోవాల‌ని కోరారు. అనంత‌రం మ‌మ‌తా బెన‌ర్జీతో బీజేపీ ఎంపీ సుబ్ర‌మ‌ణ్యన్ స్వామి భేటీ అయ్యారు.

ఈ స‌మావేశం త‌ర్వాత తాను తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీలో చేర‌తాన‌నే ఊహాగానాలకు ఆయ‌నే స్వ‌యంగా తెర దించారు. ఈ మేర‌కు ఆయ‌న ఆస‌క్తిక‌ర‌, కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

అదేమిటంటే తాను ఇప్ప‌టికే ఆమెతో ఉన్నాన‌ని పేర్కొన్నారు. తాను పార్టీలో చేరాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు. సుబ్ర‌మ‌ణ్య‌న్ స్వామి(Subramaniyan Swamy) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు దీదీ గురించి. మ‌మ‌తా బెనర్జీని ప్ర‌శంస‌ల‌తో ముంచెతారు.

ఆమెను జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ్ , మొరార్జీ దేశాయ్ , రాజీవ్ గాంధీ, చంద్ర‌శేఖ‌ర్, ఇత‌ర నాయ‌కుల‌తో పోలుస్తూ ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ఇది హ‌ల్ చ‌ల్ చేస్తోంది. టీఎంసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అభిషేక్ బెనర్జీ నివాసంలో స‌మావేశం కావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Also Read : ‘సుప్రీం’లో ఢిల్లీ స‌ర్కార్ అఫిడ‌విట్

Leave A Reply

Your Email Id will not be published!