#AkashChopra : ‘వాళ్లిద్ద‌రు’ కీల‌కం ఇండియాదే విజ‌యం

పుజారా, ర‌హానే రాణిస్తార‌న్న చోప్రా

Akash Chopra : భార‌త మాజీ క్రికెట‌ర్, ప్ర‌ముఖ కామెంటేట‌ర్ ఆకాశ్ చోప్రా సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. కాన్పూర్ లో గురువారం నుంచి మొద‌టి టెస్ట్ స్టార్ట్ కానుంది కీవీస్ తో. ఇప్ప‌టికే ఆ జ‌ట్టు టెస్టు ఛాంపియ‌న్ గా కొన‌సాగుతోంది.

కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ మోచేతి గాయం కార‌ణంగా టీ20 సీరీస్ కు అందుబాటులో లేకుండా పోయాడు. విశ్రాంతి అనంత‌రం ఈ టెస్టుకు అందుబాటులో ఉంటాడు.

మ‌రో వైపు టీ20 సీరీస్ క్లీన్ స్విప్ చేసిన భార‌త జ‌ట్టు ఫుల్ జోష్ లో ఉంది. మ‌రో వైపు స్వ‌దేశంలో ఆడ‌డం కూడా క‌లిసొచ్చే అంశం. అయితే ఇరు జ‌ట్ల ప‌రంగా చూస్తే కీవీస్ చాలా ప‌టిష్టంగా క‌నిపిస్తోంది.

ఎక్క‌డా త‌గ్గ‌ని త‌త్వం ఆ జ‌ట్టు స్వంతం. దీంతో భార‌త్, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య ఏ జ‌ట్టు గెలుస్తుంద‌నే దానిపై తాజా, మాజీ ఆట‌గాళ్లు త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు.

తాజాగా ఆకాశ్ చోప్రా (Akash Chopra) స్పందిస్తూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ప్రారంభంలో ఓపెన‌ర్లు బాగా ఆడ‌క పోయినా ఆ త‌ర్వాత బ‌రిలోకి దిగే చ‌తేశ్వ‌ర్ పుజారా, అజింక్యా ర‌హానేలు అద్భుతంగా రాణించ గ‌ల‌ర‌ని న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు.

వీరిద్ద‌రూ ఒక్క‌సారి సెట్ అయ్యారంటే ఇక వారికి తిరుగంటూ ఉండ‌ద‌న్నాడు. అంతే కాకుండా కీవీస్ జ‌ట్టు కంటే టీమిండియాకే గెలిచేందుకు ఎక్కు చాన్స్ ఉంద‌ని జోష్యం చెప్పాడు ఆకాశ్ చోప్రా(Akash Chopra).

ఓ వైపు రోహిత్ శ‌ర్మ‌, కేఎల్ రాహుల్ , రిష‌బ్ పంత్ , త‌దిత‌ర ఆట‌గాళ్లు ఫుల్ జోష్ లో ఉన్నార‌ని పేర్కొన్నాడు.

Also Read : టీసీఏ’ డిక్లేర్ త‌మిళ‌నాడు టీం

Leave A Reply

Your Email Id will not be published!