#APMlcElection : ఆ 11 ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీవే

ఇక ప్ర‌క‌టించ‌డ‌మే త‌రువాయి

AP Mlc Election : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నామినేష‌న్ల ప‌రిశీల‌న ప్ర‌క్రియ పూర్త‌యింది. దీంతో 11 ఎమ్మెల్సీ స్థానాలు(AP Mlc Election) ఏక‌గ్రీవం కానున్నాయి.

ప్ర‌త్య‌ర్థి పార్టీకి చెందిన తెలుగు దేశం పార్టీ కానీ ఇండిపెండెంట్లు సైతం బ‌రిలో ఉండ‌క పోవ‌డంతో వీరి ఎన్నిక లాంఛ‌న‌మే. దీంతో వైసీపీకి 11 మంది ఎన్నిక‌య్యేందుకు లైన్ క్లియ‌ర్ అయిన‌ట్టేన‌ని భావించ‌క త‌ప్ప‌దు.

ఇక వారు ప్ర‌మాణ స్వీకారం చేయ‌డ‌మే మిగిలి ఉంది. ఇక ఏపీలో ఇప్ప‌టి దాకా నామినేష‌న్ దాఖ‌లు చేసిన వారి వివ‌రాలు జిల్లాల వారీగా ఇలా ఉన్నాయి. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలు ఉన్నాయి.

కృష్ణా జిల్లా నుంచి త‌ల‌సిల ర‌ఘురామ్ , మొండి తోక అరుణ్ కుమార్ నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఇక విశాఖ‌ప‌ట్నం జిల్లా నుంచి ఎమ్మెల్సీలుగా వ‌రుదు క‌ళ్యాణి, వంశీ కృష్ణ యాద‌వ్, గుంటూరు జిల్లా నుంచి ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వర్లు, మారుగుడు హ‌నుమంత‌రావు ఉన్నారు.

విజ‌య‌న‌గ‌రం జిల్లా నుంచి ఇందుకురు ర‌ఘురాజు, తూర్పు గోదావ‌రి జిల్లా నుంచి అనంత ఉద‌య బాస్క‌ర్ , అనంత‌పురం జిల్లా నుంచి వై. శివ రామి రెడ్డి నామినేష‌న్లు దాఖ‌లు చేశారు.

చిత్తూరు జిల్లా నుంచి భ‌ర‌త్ , ప్ర‌కాశం జిల్లా నుంచి మాధ‌వరావు ఎన్నిక లాంఛ‌నం కానుంది. ఆయా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నామినేష‌న్(AP Mlc Election) ప‌రిశీల‌న పూర్త‌యింది.

ఈ మొత్తం ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీ ఖాతాలో జ‌మ కానున్నాయి. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే అటు అసెంబ్లీలో ఇటు శాస‌న మండ‌లిలో అత్య‌ధిక సీట్ల‌తో బ‌ల‌మైన పార్టీగా అవ‌త‌రించింది వైసీపీ.

Also Read : నానితో పాటు ఎమ్మెల్యేల‌కు భ‌ద్ర‌త పెంపు

Leave A Reply

Your Email Id will not be published!