#SatyaPalMalik : తాను ఎప్పుడూ రైతుల ప‌క్ష‌మే

స‌త్య‌పాల్ మాలిక్ కామెంట్

Satya Pal Malik : అధికార పక్షంలో ఉంటూనే ధిక్కార స్వ‌రాన్ని వినిపించిన వారిలో ప్ర‌ధానంగా చెప్పు కోవాల్సింది ఒక‌రు బీజేపీ ఎంపీ వ‌రుణ్ గాంధీ అయితే మ‌రొక‌రు మేఘాల‌య గ‌వ‌ర్న‌ర్ స‌త్య పాల్ మాలిక్.

గ‌త ఏడాది కాలం నుంచి సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఆందోళ‌న చేప‌ట్టారు ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో. భార‌తీయ జ‌న‌తా పార్టీ కంట్లో న‌లుసుగా మారారు.

వీరిద్ద‌రూ పెద్ద ఎత్తున రైతుల‌కు స‌పోర్ట్ గా నిలుస్తూ వ‌చ్చారు. ఈ త‌రుణంలో గ‌వ‌ర్న‌ర్ స‌త్య పాల్ మాలిక్(Satya Pal Malik) కీల‌క కామెంట్స్ చేశారు. సాగు చ‌ట్టాల‌ను రద్దు చేసినందుకు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు.

రైతుల ప్ర‌ధాన డిమాండ్ క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర అని చెప్పారు. రైతులు కోరుతున్న మిగిలిన డిమాండ్ల ను ప్ర‌భుత్వం వెంట‌నే ఆమోదిస్తే రైతులు ఆందోళ‌న విర‌మించి ఇంటికి వెళ‌తార‌ని గ‌వ‌ర్న‌ర్ వెల్ల‌డించారు.

మేఘాల‌య రాజ‌ధాని షిల్లాంగ్ లో ఓ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. తాను రైతుల ప‌క్షం వహిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు స‌త్య పాల్ మాలిక్(Satya Pal Malik). ఇంకా ఆందోళ‌న చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్న‌దాత‌ల‌కు సూచించారు గ‌వ‌ర్న‌ర్.

రైతుల అన్ని డిమాండ్ల‌ను ఇంకా స‌ర్కార్ ఆమోదించ లేదు. ఎంఎస్పీ చ‌ట్టాన్ని తీసుకు వ‌చ్చేందుకు స‌ర్కార్ పున‌రాలోచించాలి. వెంట‌నే దీనిపై క‌మిటీ ఏర్పాటు చేయాల‌ని సూచించారు స‌త్య పాల్ మాలిక్.

అయితే ఆందోళ‌న మ‌రింత కాలం కొన‌సాగించాల్సిన అవ‌స‌రం ఉంటుంద‌ని తాను అనుకోవ‌డం లేద‌ని పేర్కొన్నారు. అయితే ఎప్ప‌టికీ తాను రైతుల ప‌క్ష‌మే ఉంటాన‌ని మ‌రోసారి కుండ బ‌ద్ద‌లు కొట్టారు.

Also Read : ‘బీఎస్ఎఫ్ ప‌రిధి’ని విర‌మించుకోండి

Leave A Reply

Your Email Id will not be published!