#KodaliNani : భార్య పేరుతో రాజ‌కీయం మానుకో

చంద్ర‌బాబుపై కొడాలి నాని ఫైర్

Kodali Nani : టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడిపై నిప్పులు చెరిగారు మ‌రోసారి ఏపీ మంత్రి కొడాలి నాని(Kodali Nani). వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాలను ప‌రామ‌ర్శించే నెపంతో ఏపీ స‌ర్కార్ పై ఆరోప‌ణ‌లు చేయ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు.

వ‌ర‌ద న‌ష్టాల‌పై సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వెంట‌నే స్పందించార‌ని చెప్పారు. ఇవాళ కొడాలి నాని అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడారు. రాష్ట్రంలో ముమ్మ‌రంగా స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టామ‌న్నారు.

ఎప్ప‌టిక‌ప్పుడు సీఎం ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ని చెప్పారు కొడాలి నాని. చంద్ర‌బాబు చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌న్నారు. భార్య ను రోడ్డు మీద‌కు తెచ్చిన ఘ‌న‌త ఆయ‌న‌కే ద‌క్కుతుంద‌న్నారు.

ఆయ‌న రాజ‌కీయ వ్య‌భిచారిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు కొడాలి నాని(Kodali Nani). ఇక నుంచైనా బుద్ది తెచ్చుకుని భార్య పేరుతో రాజ‌కీయం చేయ‌డం మానుకోవాల‌ని సూచించారు.

రాజ‌కీయ అవ‌స‌రాల కోసం ఎవ‌రినైనా ఉప‌యోగించుకునే బాబు గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని ఎద్దేవా చేశారు. బాబు మాదిరి గానే లోకేష్ వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ ఆరోపించారు.

ఏదోలా రాజ‌కీయంగా ల‌బ్ది పొందాల‌ని చంద్ర‌బాబు తాపత్ర‌య ప‌డుతున్నార‌ని మండిప‌డ్డారు కొడాలి నాని. చంద్ర‌బాబు బుద్ది, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడ‌ని, ఆయ‌న మాట‌ల్ని ఎవ‌రూ ప‌ట్టించుకునే స్థితిలో లేరన్నారు.

అసెంబ్లీ వ‌దిలేసి కుంటి సాకుల‌తో బ‌య‌ట‌కు వెళ్లి పోయాడ‌ని విమ‌ర్శించారు. వ‌ర‌ద బాధితుల ప‌రామ‌ర్శ‌కు వెళ్లి న‌న్ను అవమానించారంటూ చంద్ర‌బాబు ఏడ్వ‌డం దారుణ‌మ‌న్నారు కొడాలి నాని.

త‌మ‌ను జూనియ‌ర్ ఎన్టీఆర్ కంట్రోల్ చేయ‌లేదంటూ వ‌ర్ల రామ‌య్య చేసిన కామెంట్స్ ను తాము ప‌రిగ‌ణ‌లోకి తీసుకోమ‌న్నారు.

Also Read : ఏపీ స‌ర్కార్ పై చంద్ర‌బాబు ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!