#BandiSanjay : పేద‌ల‌కు వ‌రం ఉచిత రేష‌న్ ప‌థ‌కం

మార్చి దాకా పెంచిన మోదీకి కృత‌జ్ఞ‌త‌లు

Bandi Sanjay : కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా క‌ష్ట కాలంలో పేద‌ల ఆక‌లి తీర్చేందుకు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఉచిత రేష‌న్ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు.

ప్ర‌తి ఒక్క‌రికి ఒక నెల పాటు ఉచితంగా రేష‌న్ (స‌రుకులు) అందించాల‌ని నిర్ణ‌యించారు. ఈ ఒక్క కార్య‌క్ర‌మం కోట్లాది పేద‌ల‌కు ఊర‌ట‌నిచ్చింది. ఎంతో మందిని ఆక‌లి నుంచి దూరం చేసింది.

క‌రోనా మ‌హమ్మారి క‌ష్ట కాలంలో ఉచిత రేష‌న్ ఏర్పాటు చేశారు. ప్ర‌స్తుతం క‌రోనా త‌గ్గుముఖం ప‌డుతోంది. దీంతో ఉచిత రేష‌న్ ప‌థ‌కాన్ని ఎత్తి వేయాల‌ని అనుకుంది కేంద్రం.

కానీ ప‌లు స్వ‌చ్చంధ సంస్థ‌లు, విప‌క్ష పార్టీలు సైతం ఉచిత రేష‌న్ ప‌థ‌కాన్ని మ‌రికొంత కాలం పాటు పొడిగించాల‌ని విన్న‌వించారు. దీంతో ఢిల్లీలో ప్ర‌ధాన మంత్రి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గం స‌మావేశంలో ఈ మేర‌కు ఉచిత రేష‌న్ ప‌థ‌కంపై చ‌ర్చ జ‌రిగింది.

మోదీ మాత్రం ఉచిత రేష‌న్ కార్య‌క్ర‌మానికి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్పంద‌న ల‌భిస్తోంద‌ని, మాన‌వ‌తా దృక్ఫ‌థంతో ప్ర‌వేశ పెట్టిన దీనిని మ‌రికొంత కాలం పాటు పెంచాల‌ని నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు మోదీ.

దీంతో కేంద్ర మంత్రివ‌ర్గం ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపింది. వ‌చ్చే ఏడాది 2022 మార్చి నెలాఖ‌రు వ‌ర‌కు ఉచిత రేష‌న్ అమ‌లు ను పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించడంపై బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ (Bandi Sanjay)సంతోషం వ్య‌క్తం చేశారు.

ఈ మేర‌కు ప్ర‌ధాని మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ నిర్ణ‌యం వ‌ల్ల కోట్లాది మంది పేద‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌ని, ఆక‌లి నుంచి విముక్తి పొందుతార‌ని తెలిపారు.

Also Read : ఇక కొలువుల భ‌ర్తీ లేన‌ట్లేనా

Leave A Reply

Your Email Id will not be published!