#RakeshTikait : తెలంగాణ‌లో ‘రైతుల గోస’ దారుణం

ఆవేద‌న వ్య‌క్తం చేసిన రాకేశ్ తికాయ‌త్

Rakesh Tikait : కేంద్ర ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన సాగు చ‌ట్టాలు, మ‌ద్ధ‌తు ధ‌ర, త‌దిత‌ర అంశాల‌పై ఆందోళ‌న చేస్తామ‌ని కిసాన్ సంయుక్త మార్చా అగ్ర నేత రాకేశ్ తికాయ‌త్ హెచ్చ‌రించారు.

ఆల్ ఇండియా రైతుల ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ లో ధ‌ర్నా చేప‌ట్టారు. అనంత‌రం తికాయ‌త్ (Rakesh Tikait)మీడియాతో మాట్లాడారు. త‌మ నాలుగు డిమాండ్ల‌లో రెండు డిమాండ్ల‌పై మాత్ర‌మే స్పందించింద‌ని ఆరోపించారు.

ఎంఎస్పీ ధ‌ర విష‌యంలో స్ప‌ష్ట‌మైన వైఖ‌రి చెప్పాల‌ని డిమాండ్ చేశారు. క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర‌పై చ‌ట్టం తేవాల‌ని కేంద్రాన్ని కోరామ‌న్నారు.

తెలంగాణ‌లో రైతుల స‌మ‌స్య‌లు చాలా ఉన్నాయ‌ని రాకేశ్ తికాయ‌త్(Rakesh Tikait) చెప్పారు. హైద‌రాబాద్ లోని గోల్కొడ లో రైతుల భూమి ఉంద‌ని, అది గోల్ఫ్ కోర్టుకు ఇచ్చార‌ని తెలిసింద‌ని వెల్ల‌డించారు.

రైతుల స‌మ‌స్య‌ల‌పై పూర్తి స‌మాచారం తెప్పించుకుని రాష్ట్ర ప్ర‌భుత్వానికి తెలియ చేస్తామ‌ని చెప్పారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయ‌కుండా ఇబ్బంది పెడుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఈ సంద‌ర్భంగా మోదీ నేతృత్వంలోని బీజేప సంకీర్ణ స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు. కేంద్రంలో ఉన్న‌ది ప్ర‌జాస్వామ్య ప్ర‌భుత్వం లేద‌ని అదానీ, అంబానీలు దానిని కంట్రోల్ చేస్తున్నార‌ని ఆరోపించారు.

మోదీ ప్ర‌భుత్వం కాద‌ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని కామెంట్ చేశారు. ఏడాది కాలం పూర్త‌యినా ఈ రోజు వ‌ర‌కు చ‌ర్చ‌ల పేరుతో కాల యాప‌న చేసింద‌న్నారు.

ఎంఎస్పీ చ‌ట్టాన్ని తీసుకు రావాల‌ని డిమాండ్ చేశారు. ఇప్ప‌టి దాకా రైతుల ఆందోళ‌న‌లో 750 మంది ప్రాణాలు కోల్పోయార‌ని వారికి న‌ష్ట ప‌రిహారం ఇవ్వాల‌ని కోరారు.

Also Read : మొగుల‌య్య గానం ఆర్టీసీ బ‌హుమానం

Leave A Reply

Your Email Id will not be published!