#AshwiniVaishnav : సోష‌ల్ మీడియా కంటెంట్ పై ఫోక‌స్

కేంద్ర ఐటీ మంత్రి కీల‌క కామెంట్స్

Ashwini Vaishnav : కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ కీల‌క కామెంట్స్ చేశారు. సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్ లు, వెబ్ సైట్ ల‌లోని కంటెంట్ కు ఆయా సంస్థ‌లే పూర్తిగా బాధ్య‌త వ‌హించాల‌ని స్ప‌ష్టం చేశారు.

ఇప్ప‌టికే విప‌రీత ధోర‌ణులు క‌లిగి ఉండ‌డంతో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. వీటిపై స‌రైన నియంత్ర‌ణ లేక పోవ‌డం కూడా ప్ర‌ధాన కార‌ణంగా ఉంటోంది.

ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం ఐటీ పాల‌సీని తీసుకు వ‌చ్చింది. కానీ కొన్ని సంస్థ‌లే వాటి ప‌రిధోలోకి వ‌స్తున్నాయి. దేశ వ్యాప్తంగా లెక్కకు మించి సోష‌ల్ మీడియా ప‌రిధిలోని సంస్థ‌లు(Ashwini Vaishnav) పుట్టుకు వ‌స్తున్నాయి.

ఇక వెబ్ సైట్స్ అయితే పుట్ట‌గొడుగుల్లా నెట్టింట్లో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. వీటన్నింటికి స‌మాచారం ఏ ప్రాతిప‌దిక‌న తీసుకుంటున్నారు. దానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అన్న దానిపై కూడా పున‌రాలోచించాల‌ని కేంద్ర మంత్రి(Ashwini Vaishnav) పేర్కొన్నారు.

గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా సాంకేతిక‌త‌, ఇంట‌ర్నెట్ లో వ‌చ్చిన మార్పుల‌కు ఇంట‌ర్నెట్ పాల‌నా నిర్మాణంలో ప్రాథ‌మిక పున‌రాలోచ‌న అవ‌స‌ర‌మ‌న్నారు.

కంటెంట్ క్రియేట్ చేసిన విధానం, వినియోగించే ప‌ద్ద‌తి, నెట్ క‌నెక్టివిటీ, యాక్సెస్ చేసే భాష‌లు, మోడ్స్ అన్నీ మారి పోయాయి. దీంతో ఈ వ్య‌వ‌స్థ‌ను మొత్తం పున‌రాలోచించాల‌ని అనుకుంటున్న‌ట్లు వైష్ణ‌వ్ స్ప‌ష్టం చేశారు.

ఇండియా ఇంట‌ర్నెట్ గ‌వ‌ర్నెన్స్ ఫోరమ్ – ఐఐజీఎఫ్ 2021 ను ఆయ‌న ప్రారంభించి ప్ర‌సంగించారు. ఇంట‌ర్నెట్ ను అత్య‌ధికంగా వినియోగించే దేశాల్లో భార‌త్ ఒక‌టిగా ఉంద‌న్నారు.

మొబైల్ ప‌రిక‌రాల ద్వారా కంటెంట్ ను సృష్టించి వినియోగించే యుగంలో, కంటెంట్ కు బాధ్య‌త‌తో స‌హా కీల‌క అంశాల‌పై చ‌ర్చించాల‌ని ఫోర‌మ్ లో పాల్గొన్న వారిని సూచించారు కేంద్ర మంత్రి.

Also Read : ‘క‌త్తుల క‌ర‌చాల‌నం’ సంచ‌ల‌నం

 

Leave A Reply

Your Email Id will not be published!