#MukulSangma : టీఎంసీలో చేరిన మాజీ సీఎం, ఎమ్మెల్యేలు

మేఘాల‌య కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై

Mukul Sangma : సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ లు త‌గులుతున్నాయి. ఓ వైపు గోవాలో మాజీ సీఎం రాజీనామా చేసి టీఎంసీలో చేరారు.

తాజాగా మేఘాల‌య రాష్ట్రానికి చెందిన మాజీ సీఎం ముకుల్ సంగ్మాతో(Mukul Sangma) పాటు 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. సంగ్మా సార‌థ్యంలో ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

దీంతో ఆ పార్టీకి పెద్ద దెబ్బ ప‌డినట్ల‌యింది. ఈ మేర‌కు అసెంబ్లీ స్పీక‌ర్ మెత్బా లింగ్డోకు తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు లేఖ‌లు రాశారు. ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు త‌మ పార్టీలో చేరిన‌ట్లు టీఎంసీ ప్ర‌క‌టించింది.

దీంతో మేఘాల‌య అసెంబ్లీలో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా నిలిచింది. మ‌రో వైపు ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేయాల‌ని టీఎంసీ ప్లాన్ చేస్తోంది.

ఈ మేర‌కు ఇప్ప‌టికే ప‌లుమార్లు సీఎం మ‌మ‌తా బెన‌ర్జీతో పాటు ఆమె మేన‌ల్లుడు , ఎంపీ అభిషేక్ బెన‌ర్జీ ప‌ర్య‌టిస్తున్నారు. ఇందులో భాగంగానే పావులు క‌దుపుతున్నారు.

దేశ వ్యాప్తంగా టీఎంసీని విస్త‌రింప చేయాల‌నే ప్లాన్ ను వ‌ర్క‌వుట్ చేస్తున్నాడు ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిషోర్. ప్ర‌తిపక్ష నేత‌గా ఉన్న ముక‌ల్ సంగ్మా కాంగ్రెస్ హైక‌మాండ్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

పీసీసీ చీఫ్ విన్సెంట్ హెచ్ పాలాతో ఆయ‌న‌కు మొద‌టి నుంచీ ప‌డ‌డం లేదు. పార్టీ హైక‌మాండ్ సూచ‌న‌తో ఇద్ద‌రూ క‌లిసి ప‌ని చేయాల‌ని అనుకున్నారు. ఇంత‌లోనే సంగ్మా ఉన్న‌ట్టుండి పార్టీని వీడారు. దీంతో ఆ పార్టీ హైక‌మాండ్ పున‌రాలోచ‌న‌లో ప‌డింది.

Also Read : మార్చి దాకా ఉచిత రేష‌న్

Leave A Reply

Your Email Id will not be published!