#GattuRamachandraRao : ‘గులాబీ గుట్ట‌’ను వీడిన ‘గట్టు’

టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై

Gattu Ramachandra Rao : తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ కార్య‌ద‌ర్శిగా ఉన్న ప్ర‌ముఖ సీనియ‌ర్ నాయ‌కుడు గ‌ట్టు రామ‌చంద్ర రావు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు తాను పార్టీకి గుడ్ బై చెబుతున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఇవాళ ఆయ‌న త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. పార్టీ చీఫ్ కు సుదీర్ఘ‌మైన లేఖ రాశారు. త‌న‌కు ఇచ్చిన ప‌ద‌వికి న్యాయం చేయ‌లేక పోతున్నాన‌ని పేర్కొంటూ గులాబీ గుట్ట లాంటి పార్టీని వీడుతున్న‌ట్లు తెలిపారు.

గ‌ట్టు రామ చంద్ర‌రా వు గ‌తంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అంత‌కు ముందు మెగాస్టార్ స్థాపించిన ప్ర‌జా రాజ్యం పార్టీలో ఉన్నారు.

క‌మ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ( మార్క్సిస్ట్ ) లో వివిధ స్థాయిలలో ప‌ని చేశారు. ఇదిలా ఉండ‌గా సీపీఎంలో కొంత మంది నాయ‌కుల ప‌నితీరు కార‌ణంగా 2008లో ఆ పార్టీ అధినాయ‌క‌త్వాన్ని ప్ర‌శ్నించాడు.

నిల‌దీశాడు. తిరుగుబాటు చేశాడు. వైఎస్సార్ పార్టీలో చేరే కంటే ముందు ప్ర‌జా రాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్ల‌డంలో కృషి చేశాడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం త‌ర్వాత ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ఇదిలా ఉండ‌గా గ‌ట్టు రామ చంద్ర రావు (Gattu Ramachandra Rao)సామాజిక అంశాల‌పై మంచి ప‌ట్టు ఉన్న వ్య‌క్తి. కొంత కాలం పాటు తెలుగు భాషా ప‌త్రిక సామాజిక న్యాయం ప‌త్రిక‌కు ఎడిట‌ర్ ( సంపాద‌కుడు)గా వ్య‌వ‌హ‌రించారు.

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌చురించేలా చూశారు. అంతే కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధిగానూ, వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల విభాగానికి రాష్ట్ర క‌న్వీన‌ర్ గాను ఉన్నారు.

తెలంగాణ‌లో వైఎస్సార్ సీపీ పార్టీకి భ‌విష్య‌త్తు లేద‌ని భావించిన గ‌ట్టు ఇటీవ‌ల టీఆర్ఎస్ లో చేరారు. కానీ ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ద‌క్క‌క పోవ‌డం వ‌ల్ల‌నే పార్టీని వీడుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Also Read : ఢిల్లీకి వెళ్లి ఏం సాధించారు

Leave A Reply

Your Email Id will not be published!