#GautamGambhir : గంభీర్ ను బెదిరించిన ఈమెయిల్స్ గుర్తింపు

పాకిస్తాన్ నుంచి వ‌చ్చాయ‌ని వెల్ల‌డి

Gautam Gambhir  : భార‌త మాజీ క్రికెట‌ర్, ప్ర‌స్తుత ఢిల్లీ భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ఎంపీ గౌతం గంభీర్ కు సంబంధించిన బెదిరింపు ఈమెయిల్స్ కేసు విష‌యంపై కీల‌క ఆధారాలు ల‌భించాయి.

ఈ మేర‌కు ఆ ఈ మెయిల్స్ పాకిస్తాన్ నుంచి వ‌చ్చిన‌ట్లు గుర్తించిన‌ట్లు ఢిల్లీ పోలీసు వ‌ర్గాలు ఇవాళ వెల్ల‌డించాయి. త‌న‌ను చంపుతామంటూ ఈ మెయిల్స్ వ‌చ్చాయంటూ రెండు రోజుల కింద‌ట గౌతం గంభీర్ (Gautam Gambhir ) ఢిల్లీ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.

అంతే కాకుండా ఆధారాల‌తో స‌హా పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ప్ర‌భుత్వం గ‌ట్టి భ‌ద్ర‌త‌ను క‌ల్పించాల్సిందిగా ఆదేశించింది. ఆయ‌న నివాసం వ‌ద్ద క‌ట్టుదిట్ట‌మైన సెక్యూరిటీ ఏర్పాటు చేశారు ఢిల్లీ పోలీసులు.

ఇక విచార‌ణ‌లో భాగంగా గౌతం గంభీర్(Gautam Gambhir )ఫిర్యాదులో పేర్కొన్న ఆధారంగా ఈ మెయిల్స్ ఎక్క‌డి నుంచి వ‌చ్చాయ‌న దానిపై సైబ‌ర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ విచార‌ణ జ‌రిపింది.

ఈ విచార‌ణ‌లో ఆస‌క్తిక‌ర‌మైన అంశం బ‌య‌ట ప‌డింది. అదేమిటంటే ఆ రెండు బెదిరింపుల‌తో కూడిన ఈ మెయిల్స్ దాయాది పాకిస్తాన్ నుంచి వ‌చ్చిన‌ట్లు నిర్దార‌ణ అయ్యింది.

ఆ రెండు మెయిల్స్ చిరునామా పాకిస్తాన్ కు చెందిన సాహిద్ హ‌మీద్ గా గుర్తించిన‌ట్లు వెల్ల‌డించారు. ఐఎస్ఐఎస్ క‌శ్మీర్ నుంచి 24 గంట‌ల్లోపు ఈమెయిల్స్ వ‌చ్చిన‌ట్లు గౌతం గంభీర్ పోలీసుల‌కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

వ‌చ్చిన రెండో ఈ మెయిల్ లో నిన్ను చంపేద్దాం అనుకున్నాం. కానీ నువ్వు బ‌తికి పోయావు. నీ కుటుంబంపై నీకు ప్రేమ ఉంటే రాజ‌కీయాలకు, క‌శ్మీర్ స‌మ‌స్య‌కు దూరంగా ఉండు అని ఉందని తెలిపారు పోలీసులు. ఇంకా పూర్తి వివ‌రాలు తెలియాల్సి వుంది.

Also Read : ‘మెనూ వివాదం’పై బీసీసీఐ క్లారిటీ

Leave A Reply

Your Email Id will not be published!