#INDvsNZ1stTest : భారీ స్కోర్ దిశ‌గా టీమిండియా

రాణించిన శ్రేయ‌స్, జ‌డేజా, గిల్

IND vs NZ 1st Test : భార‌త, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య మొద‌టి టెస్ట్(IND vs NZ 1st Test) లో భార‌త బ్యాట‌ర్లు రాణించారు. మొద‌ట్లో త‌డ‌బ‌డినా మెల్ల‌గా ప‌రుగులు చేస్తూ వ‌చ్చారు. ఇదిలా ఉండ‌గా మ‌రోసారి కెప్టెన్ అజింక్యా ర‌హానే నిరాశ ప‌రిచాడు.

కేవ‌లం 35 ప‌రుగులు మాత్ర‌మే చేసి నిర్ల‌క్ష్యంగా త‌న వికెట్ పారేసుకున్నాడు. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే విరాట్ కోహ్లీ స్థానంలో సార‌థ్య బాధ్య‌త‌లు చేప‌ట్టిన ర‌హానే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఓపెన‌ర్లుగా మ‌యాంక్ అగ‌ర్వాల్ , శుభ్ మ‌న్ గిల్ ప్రారంభించారు. ఆరంభంలోనే అగ‌ర్వాల్ పెవిలియ‌న్ దారి ప‌ట్టాడు. అనంత‌రం క్రీజు లోకి వ‌చ్చిన వైస్ కెప్టెన్ శుభ్ మ‌న్ గిల్ హాఫ్ సెంచ‌రీ సాధించాడు.

టెస్టుల్లో మ‌రోసారి మెరిశాడు ర‌వీంద్ర జ‌డేజా. మ‌రో హాఫ్ సెంచ‌రీ చేశాడు. టెస్టుల్లో ఇది అత‌డికి 17వ హాఫ్ సెంచ‌రీ. అయిదో వికెట్ కు శ్రేయ‌స్ అయ్య‌ర్ తో క‌లిసి జ‌డేజా భారీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు.

వీరిద్ద‌రి మ‌ధ్య వంద ప‌రుగుల భాగ‌స్వామ్యం పూర్త‌యింది. శ్రేయ‌స్ అయ్య‌ర్ 75 ప‌రుగులు చేసి సెంచ‌రీ దిశ‌గా సాగుతున్నాడు. జ‌డేజా 50 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నాడు.

వెలుతురు స‌రిగా లేని కార‌ణంగా కీవీస్ బౌల‌ర్లు కేవ‌లం 84 ఓవ‌ర్లు మాత్ర‌మే చేశారు. ఇక ప్ర‌త్య‌ర్థి న్యూజిలాండ్ (IND vs NZ 1st Test)బౌల‌ర్ల‌లో కైల్ జేమిస‌న్ మూడు వికెట్లు తీసుకోగా సౌథీ ఖ‌తాలో మ‌రో వికెట్ చేరింది.

వీరిద్ద‌రూ గ‌నుక రాణిస్తే భార‌త్ మెరుగైన భారీ స్కోర్ చేసే చాన్స్ ఉంది. కాగా కెప్టెన్ ర‌హానే పూర్ ప‌ర్ ఫార్మెన్స్ పై నెటిజ‌న్లు ఫైర్ కావ‌డం విశేషం.

Also Read : ఐసీసీ ర్యాంకింగ్స్ లో బాబ‌ర్, హ‌స‌రంగ టాప్

Leave A Reply

Your Email Id will not be published!